హైదరాబాద్‌ (Media Boss Network): ప్ర‌ముఖ అమెరికా తెలుగు సంఘం ‘అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ATA)’ భాగ్య‌న‌గ‌రం గ‌డ్డ‌పై సాహితీ సౌర‌భాల‌ను వెద‌జ‌ల్లుతోంది. డిసెంబర్‌ 17వ తేదీన ఆటా వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు జ‌ర‌గ‌నుంది. ఆరోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కొలకలూరి ఇనాక్‌, ముఖ్య అతిధిగా నందిని సిధారెడ్డి హాజరవుతున్నారు. వేణు నక్షత్రం ఆహ్వానం పలుకుతారు. ఆటా మాట పేరుతో మధు బొమ్మినేని మాట్లాడుతారు.

సాహిత్య వేడుకలు పేరుతో జయంత్‌ చల్లా, ఆటా సాహిత్య సేవలు పేరుతో రాజేశ్వరరావు టేక్మాల్‌ మాట్లాడనున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియారంగం అంశంపై కాసుల ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శాంతి స్వరూప్‌, శ్రీమతి ఐనంపూడి లక్ష్మీ, జె. శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్వామి ముద్దం, జెఎల్‌ నరసింహారెడ్డి, నలిమెల భాస్కర్‌, దెంచనాల శ్రీనివాస్‌, కొలకలూరి మధుజ్యోతి, నరాల రామిరెడ్డి, కొండపల్లి నీహారిణి తదితరులు హాజరై ప్ర‌సంగిస్తారు.

టేకులపల్లి గోపాల్‌ రెడ్డి, మధురాంతకం నరేంద్ర, మధుబాబు, పెద్దింటి అశోక్‌ కుమార్‌, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, మహ్మద్‌ గౌస్‌, హుమయూన్‌ సంఫీుర్‌, పత్తిపాక మోహన్‌, ఎస్‌.వి. సత్యనారాయణ, మువ్వా శ్రీనివాసరావు, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, మందరపు హైమవతి, కొండపల్లి నీహారిణి, కందకూరి శ్రీరాములు, జల్లేపల్లి బ్రహ్మం, కవి యాకూబ్‌, వెల్డండి శ్రీధర్‌, రవీందర్‌ మనుకూరి, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, దేశపతి శ్రీనివాస్‌, పెంచలదాస్‌ తదితరులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమానికి జి. కిషన్‌ రావు అధ్యక్షత వహిస్తే, ముఖ్య అతిథులుగా జూలూరి గౌరీ శంకర్‌, శ్రీమతి మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిధిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ హాజరుకానున్నారు. తప్పెట రామ ప్రసాద్‌ రెడ్డి, బలగం వేణు, అల్లాణి శ్రీధర్‌, మామిడి హరికృష్ణ, షరీఫ్‌ మహ్మద్‌ కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలు ATA అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ATA ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ ఆటా వేడుకలు చైర్‌ జయంత్‌ చల్లా, కో చైర్‌ వేణు సంకినేని, లిటరరీ కమిటీ చైర్‌ వేణు నక్షత్రం ఆధ్వర్యంలో జరగనున్నాయి.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

 

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *