గాజువాక, డిసెంబర్ 13, 2023:
వ‌స్త్ర ప్ర‌పంచంలో తిరుగులేని అభిమానం చూర‌గొంటున్న‌ సరికొత్త షాపింగ్ మాల్ ‘సౌత్ షాపింగ్ మాల్‌’ గాజువాక‌లోనూ ప్రారంభ‌మైంది. సినీ నటి సురభి ‘సౌత్ షాపింగ్ మాల్‌’ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. క్యాష్ కౌంటర్ ను తిప్పల ప్రణీతా నితేష్ ప్రారంభించారు. హను ఫిలిమ్ ఫ్యాక్టరీ ఈ వేడుక‌ను నిర్వహించింది. నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందజేస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొనాలని సినీ నటి సురభి ఈ సంద‌ర్భంగా ఆకాంక్షించారు. ఈ షాపింగ్ మాల్ మరెన్నో బ్రాంచ్ లతో ముందుకు సాగాలని విషెస్ అందించారు. విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమన్నారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోతున్న పండగ సీజన్‌లో వినియోగదారుల మనస్సును దోచే విస్తృత కలెక్షన్లతో ముందుకు రావాలని ఆమె కోరారు.

సౌత్ షాపింగ్ మాల్ ను పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ఏర్పాటు చేయడం సంతోషించ తగ్గ విషయమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. అత్యంత సరసమైన ధరలకు వస్త్రాలను అందించి వినియోగదారుల అభిమానాన్ని అందుకోవాలన్నారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, పల్లా శ్రీనివాసరావు, నరసింహ పాత్రుడు, వురుకూటి చందు, ఏజే స్టాలిన్, స్టేట్ మైనారిటీ సెక్రటరీ ఎస్ఎండీ గౌష్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, క్లాత్, మర్చంట్ అసోసియేషన్ స‌భ్యుడు సుబ్బారావు, బలిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Indian Entertainment అంతా ఇప్పుడు ఒకే యాప్‌లో
HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి
సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి..

Google play store link:
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

website link:
www.hystar.in

By admin