ప్రజాప్రతినిధి అంటే ప్రజ సేవ చేసేందుకు.. కానీ పదవి అడ్డుపెట్టుకుని తన సొంత వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి కాదు. తాను ప్రజాసేవలో మహాత్ముడి అంతటివాడిని అంటూ మీడియా ముందు గొప్పలకుపోయే బెజవాడ ఎంపీ బ్యాంక్ అప్పుల వ్యవహారాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బెజవాడ ఎంపీ కేశినేని నాని బ్యాంక్‌లకు ఎగనామం పెట్టే క్రమంలో ఉచ్చులో చిక్కుకుంటున్నట్టే కనిపిస్తోంది. కేశినేని అప్పుల భాగోతం బయటపడింది. కోట్లాది రూపాయల అప్పులు బ్యాంక్ నుంచి తీసుకుని ఎంతకూ తిరిగి చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఈ కేసు దాక తెచ్చుకోవడం వెనుక కేశినేని వ్యవహార శైలియే కారణమే చర్చ వినిపిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేశినేని కార్గో అండ్ క్యారియర్ ప్రైవెట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద గతంలో కోట్లాది రూపాయలు అప్పులు తీసుకున్నారు. యూనియన్ బ్యాంక్ అధికారులు.. అప్పు వసూలు చేసేందుకు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్‌లో కేసు వేశారట. కేశినేని అప్పుల బాగోతంపై స్పందించిన ట్రిబ్యునల్ కేశినేని కార్గో అండ్ క్యారియర్, కేశినేని శ్రీనివాసరరావు పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. జూలై 11వ తేదిన ఉదయం 10.30నిమిషాలకు డెబిట్ రికవరీ ట్రిబ్యూనల్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటన పొలిటికల్ పరంగా కేశినేనికి డ్యామేజ్ జరుగుతుందనే టాక్ బెజవాడలో గట్టిగా వినిపిస్తోంది.