ఢిల్లీ: గల్ఫ్ దేశాలలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ఈ ఇన్సూరెన్స్ వర్తించడం లేదని ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సదస్సులో వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి ప్రస్తావించారు. భారతదేశ భూభాగంలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుందని ఇటీవల యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఒక క్లెయిమ్ ను తిరస్కరించిన విషయాన్ని భీంరెడ్డి సభ దృష్టికి తెచ్చారు.

సామాజిక భద్రతలో భాగంగా భారత ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ అనే ప్రమాద బీమా – పిఎంఎస్బివై (ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రమాదవశాత్తు మరణించినా, ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల బీమా చెల్లిస్తారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల నుండి ‘ఆటో డెబిట్’ పద్ధతిలో వత్సరానికి రూ.20 ప్రీమియంను కట్ చేసుకొని పిఎంఎస్బివై పథకాన్ని వర్తింపజేస్తారు. ప్రతి సంవత్సరం పాలసీని రేనివల్ చేసుకోవాలి. ఈ-శ్రమ్ కార్డుదారులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. 18 నుండి 70 సంవత్సరాల వయస్సు వారికి ఈ పాలసీ వర్తిస్తుంది.

By admin