మీరు తెలుగు బిగ్‌బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారా..? ప్రతి రోజూ ఆ ఇంటిని చుస్తూ.. మీకు ఇంట్లోకి వెళ్లాలని ఉందా..? సామాన్యుడిగా అడుగుపెట్టి సెలబ్రిటీగా మారాలని అనుకుంటున్నారా..? అయితే ఇంకేందుకు ఆలస్యం.. వివరాలు ఇవిగో..

తెలుగు బుల్లితెర వరుసగా ఐదు సీజన్లు హిట్ అయి.. ఆరో సీజన్‌కు రెడీ అవుతోంది బిగ్‌బాస్ షో. ఇటీవల బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో ముగియగా.. బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు అంతా ఒకచోట చేరి వారు చెప్పుకునే ముచ్చట్లు.. గొడవలతోపాటు వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది..?, ఎలా ఈస్థాయికి వచ్చారు..? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు క్యూరియాసిటీ చూపిస్తుంటారు. అందుకే బిగ్‌బాస్ షోపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆ షోను ఆదరించే అభిమానులు ఎప్పుడూ ఉంటారు. ఆరో సీజన్‌కు కంటెస్టెంట్లు ఎవరు వస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. యాంకర్ శివ, శ్రీరాపాక ప్రచారంలో ఉన్నాయి.

అయితే తాజాగా బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సామాన్యులు కూడా పాల్గొనేందుకు షో నిర్వాహకులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. గతంలో సీజన్-2లో సామాన్యులకు బిగ్‌‌బాస్ షోలో అవకాశ కల్పించగా.. మళ్లీ ఆ తరువాత ఛాన్స్ ఇవ్వలేదు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-6కు కామాన్ మ్యాన్‌కు అవకాశం ఇస్తున్నట్లు షో హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకులు విడుదల చేశారు.

‘బిగ్‌బాస్ సీజన్‌-6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్ షోను చూశారు. ఆనందించారు. మీరు ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదూ.. అందుకే స్టార్ మా ఇస్తుంది.. ఆకాశాన్ని అందుకునే అవకాశం. వన్ టైమ్ గోల్డోన్ ఆఫర్. టికెట్ టూ బిగ్‌బాస్ సీజన్-6’ అని నాగార్జున తెలిపారు. మరిన్ని వివరాలకు starmaa.startv.com ఓపెన్ చేయాలని సూచించారు.

పైన ఉన్న లింక్‌ను క్లిక్ చేసి.. పేరు, అడ్రస్, కాంటాక్ట్ నంబరు వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీ గురించి ఆసక్తికర విషయాలను ఎంటర్ చేయాలి. అంతేకాకుండా మీ టాలెంట్‌కు సంబంధించి ఓ వీడియోను తీసి అప్‌లోడ్ చేయాలి. ఈ వీడియో 3 నిమిషాలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రిజెక్ట్ అవుతాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. starmaa.startv.com లింక్ క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని.. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు రెడీ అయిపోయిండి.

By admin