హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా ఉంది. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కర్నాటకలో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ తెలంగాణలోనూ పాగా వేయగలదని ఆ పార్టీ నాయకులు ప్రచారంలో దూకుడు పెంచినప్పటికీ తాజాగా విడుదలైన తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ (TJF) సర్వేలో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితం కావడం కలవరపాటుకి గురిచేస్తోంది. పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాలు, బలమైన నాయకత్వం లేకపోవడం, భరోసాగా, బలంగా నిలబడి పాలిస్తుందన్న నమ్మకం ప్రజలకు కలిగించకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చని టీజేఎఫ్ టీమ్ చెబుతోంది.
సర్వేలో భాగంగా పబ్లిక్ దగ్గర.. “పరిస్థితి ఏంటి” అని అడిగితే.. “అంతా కాంగ్రెస్ గాలి వీస్తోంది కదా..” అని అత్యధికులు అంటున్నారు. కానీ తాము మాత్రం “కారు గుర్తుకే ఓటేస్తాము” అని చెబుతున్నారు. దీంతో అత్యధిక ప్రజల మనస్సుల్లో ఏముందో టీజేఎఫ్ బృందం గుర్తించింది. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని టీజేఎఫ్ సర్వే తేల్చింది. మొత్తమ్మీద టీజేఎఫ్ సర్వే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r