మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ నియోజక వర్గంలో ఓ సింహం సంచరిస్తోంది. అది ఆకలి గొన్న సింహమే కాదు, పగబట్టిన సింహం కూడా..! చదివితే ఆశ్చర్యమే కానీ వాస్తవం అదే. అక్కడ అడవికి అంతటికీ సింహం రాజై ఏలితే.. ఇక్కడ మహబూబ్నగర్ నియోజకవర్గ రాజ్యాన్ని ఏలెందుకు “పాలమూరు సింహం” వేట మొదలెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏ.ఐ.ఎఫ్.బి) పార్టీ అభ్యర్థి మున్నూరు రవి ఓట్ల వేట కోసం కసరత్తు మొదలుపెట్టారు. అలుపెరుగని తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి గుర్తు “సింహం” కావడం చేత ఈ గుర్తు అందరి జనాలకు బాగా సుపరిచితంగా ఉండడంతో ఓటర్లలో చర్చ మొదలైంది. కెసిఆర్ ముఖ్య ముఖ్య అనుచరునిగా గుర్తింపు ఉన్న మున్నూరు రవి టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటిలో ఉన్నారు ఆయనకు సింహం గుర్తు లభించడంతో మిగతా పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. అసలు సింహానికి” సాటి పోటీ ఏ పార్టీనో అర్థం కాని పరిస్థితి. నియోజకవర్గంలో కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మొదట త్రిముఖ పోటీ అని భావించినప్పటికీ ఆ తర్వాత మున్నూరు రవి రంగ ప్రవేశంతో సీన్ ఒక్కసారిగా మారింది. రవి పోటీతో ప్రధాన ప్రత్యర్థులు సింహం గుర్తు వల్ల ఎవరికి నష్టం జరగబోతుందన్న అంచనాలు మొదలయ్యాయి. కొందరు కాంగ్రెస్ పార్టీకి నష్టం అంటే మరికొందరు టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. ఇంకా మరికొందరైతే “పగబట్టిన సింహం” కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం ఉండవచ్చని మరికొందరు అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం విభేదించి బయటికి వచ్చిన మున్నూరు రవి బిఆర్ఎస్ పార్టీకి రెబల్ గానే ప్రజలు అనుకుంటున్నారు. ఈ తరుణంలో మున్నూరు రవి ప్రభావం ఆయా పార్టీలపై ఎంత ఉంటుంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
పాలమూరు సింహం ఎందుకు పగబట్టింది? తెలంగాణ ఉద్యమకారుడిగా కెసిఆర్ భక్తునిగా ఉన్న తనపై అడుగడుగున తన భవిష్యత్తును మరియు మహబూబ్ నగర్ ప్రజలను పీడిస్తున్న శ్రీనివాస్ గౌడ్ మీద పోరాటము చేస్తున్నందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డుగోడగా నిలిచాడని తనపై తన మద్దతు దారులకు ఉద్యమకారులకు అక్రమంగా కేసులు బంధించాలని ఆర్థికంగా,మానసికంగా జీవనోపాధిని దెబ్బతీశాడని మున్నూరు రవి ఆక్రోషం తో ఉన్నాడు తననూ తన మద్దతు దారులను అన్యాయంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తగిన గుణపాఠం నేర్పాలని మహబూబ్నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్నానని సన్నిహితులతో చెప్పకున్నాడు .ఇప్పుడున్న జాతీయ పార్టీ అభ్యర్థులు పాలమూరు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న రోజుల్లో ఒక్కరోజు ఇక్కడ స్పందించకుండా ఎన్నికలలో వచ్చి మీకు తోడుగా ఉంటామన్నడం మళ్లీ మా జీవితాలు ఆగం చేయడానికి కొత్త అవతారాలు వచ్చాయని వీరిని ఓడించాలని.తెలంగాణ కోసం ఎన్ని త్యాగాలు చేసిన తనకు అన్యాయం జరిగిందని పలు సభలు సమావేశాలలో చెప్పారు. తన ఆత్మ గౌరవాన్ని బిఆర్ఎస్ నాయకులు కొందరు దెబ్బతీశారని పదేపదే ప్రజలకు చెబుతున్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు భరించి, గడించి చివరకు విసిగి వేసారి పార్టీకి దూరం కావలసి వచ్చిందని ఆయన అభిమానులు చెబుతున్నారు. వాస్తవంగా మున్నూరు రవి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేదాకా ఒక వంద మంది కార్యకర్తలు కూడా ఆయనకు లేరు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారని తెలియగానే బిఆర్ఎస్ లో ఆందోళన మొదలైందని అంటున్నారు తనకు టికెట్ రాకుండా అనేక అవమానాలకు గురి చేశారని ఆ పార్టీ సంగతి ఎంటో చూడాలని కృత నిశ్చయంతో ఉన్నానని రవి అంటున్నాడు. అందుకే పాలమూరు సింహం పగబట్టింది అంటూ జనాలు గుసగుసలాడుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఓటు బ్యాంకును సింహం ఎంతవరకు చీల్చి చెండాడుతుందో వేచి చూడాలి. అంతేకాదు పాలమూరు మున్నూరు రవి టార్గెట్ టిఆర్ఎస్ మాత్రమేనని అనుకుంటున్నారు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏ పార్టీని అత్యధికంగా మున్నూరు రవి టార్గెట్ చేస్తారు? ఎవరు ఆయన టార్గెట్? అనేది కూడా ప్రముఖంగా చర్చించాల్సిన అవసరం ఉంది