పటాన్ చెరు నియోజకవర్గంలో కారు ఖాళీ అవుతోంది. BRS నేతలంతా గులాబీ గూటిని వదిలి అభయ హస్తం అందుకుంటున్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండటంతో ఆ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో నేడు భారీగా చేరికలు జరిగాయి. అమీన్ పూర్ (మం) ఐలాపూర్ తండా BRS ఉప సర్పంచ్ పరుశురాం నాయక్, ఇందిరమ్మ కాలనీ నుంచి వందమంది BRS శ్రేణులు, నందిగామకు చెందిన BRS నాయకులు వెల్లిమెల నారాయణరెడ్డి, మనోహర్ గౌడ్, కొమరయ్య యాదవ్, మల్లేష్ లు కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు.

By admin