హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): హైదరాబాద్ రవీంద్ర భారతిలో నటరాజ్ అకాడమి, ‘మనం’ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మానవ సేవయే.. నా ధ్యేయం’ కార్యక్రమం ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో నటరాజ్ అకాడమి వ్యవస్థాపకులు గిరి నల్లా, మనం ఫౌండేషన్ చైర్మన్ ఆర్ ఎస్ కుమార్ తో పాటు ముఖ్య అతిధిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ప్రత్యేక అతిధిగా అమెరికా వాసి, ఏఎస్ఐ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ శరత్ వేముల, విశిష్ట అతిధిగా ఉస్మానియా యూనివర్సిటీ డీన్ గడ్డం మల్లేష్, గౌరవ అతిధిగా ఎన్ వీ కే ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కుమార్, సభ అధ్యక్షులుగా ప్రముఖ జ్యోతిష్యులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవా రత్న, ఉత్తమ విద్యా రత్న అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా మనం ఫౌండేషన్ చైర్మన్ ఆర్ఎస్ కుమార్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవను తన కర్తవ్యంగా భావించానని తెలిపారు. వారి ఆకలి తన ఆకలిగా భావించానని.. ఇంతమంది పెద్దల మధ్య గౌరవం దక్కడం తన అదృష్టమన్నారు. మున్ముందు తన శక్తి కొద్ది జనానికి సేవ చేసే అవకాశం రావాలని.. అలాగే తనకు చేయూతను అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసిన సేవ పుణ్యఫలం తన కుటుంబానికి.. తనను ప్రోత్సహించిన ఆత్మీయులకు.. స్నేహితులకు దక్కాలని ఆకాంక్షించారు. అలాగే తనకు సహాయం అందిస్తున్న మిత్రులు కాసర్ల శ్రీనివాస్, తపస్వి రెడ్డి, తిరుమల బ్యాంక్ చంద్రశేఖర్ గారు, శ్రీ డెవలపర్స్ భోగరాజు మూర్తి, ముంబయి ఆనంద్ చోర్డియా గారు, దుబాయ్ రామ్ చందర్ రెడ్డి, కాటం శ్రీకాంత్, కాసర్ల జైపాల్, రేణికింది బాలకిషన్ లకు ఆర్ ఎస్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక నటరాజ్ అకాడమి వ్యవస్థాపకులు గిరి నల్లా సేవలను సైతం ‘మనం’ ఫౌండేషన్ చైర్మన్ ఆర్ఎస్ కుమార్ కొనియాడారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin