గజ్వేల్ (మీడియాబాస్ నెట్‌వర్క్): గజ్వేల్ నియోజకవర్గంలో బరిలోకి దిగిన మన టీఆర్ఎస్ పార్టీ అధినేత ఏసీపీ ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు చేసే పనులను వివరిస్తున్నారు. అయితే ఏసీపీ వినూత్న ప్రచారానికి తెర తీశారు. తాను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికి నిత్యం భోజనం అందించే కార్యక్రమం చేపడుతానని చెప్పారు. ప్రతి కులానికి ఒక హెలికాప్టర్ కొనిస్తానని వాగ్దానం చేశారు. న్యూస్ కవరేజీ కోసం వెళ్లే జర్నలిస్టులకు బెంజ్ కారు కొనిస్తానని హామీ ఇచ్చారు. పల్లకి గుర్తుపై ఓటువేసి తనను గెలిపిస్తే ఎవరు చేయలేని పనులను చేస్తానని వినూత్న హామీలు ఇచ్చారు. నియోజకవర్గంలో అటోలో తిరుగుతూ, బజ్జీలు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r