• అధ్యాక్రాంతి గురు ‘లహుజీ రఘోజీ సాళ్వే మాంగ్’ జన్మదినోత్సవంను ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా ప్రకటించాలి.
  • ఘనంగా మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యాక్రాంతి గురు ‘లహుజి రఘోజీ సాళ్వే మాంగ్’ వస్తాద్ 229 వ జయంతి ఉత్సవాలు
  • సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మాంగ్ స‌మాజ్ రాష్ట్ర అధ్యక్షులు, గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్

హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
అధ్యాక్రాంతి గురు ‘లహుజీ రఘోజీ సాళ్వే మాంగ్’ జన్మదినోత్సవంను ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా ప్రకటించాల‌ని మాంగ్ స‌మాజ్ రాష్ట్ర అధ్యక్షులు, గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ‘లహుజీ రఘోజీ సాళ్వే మాంగ్’ 229వ జయంతి వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు.

స్వాతంత్య్రం సాధించాలి అనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి, “జగేల్ తర్ దేశా శాటి, మరెల్ తర్ దేశా శాటి ” అంటే ‘దేశ స్వాతంత్య్రం కోసం వీరమరణమో లేదా ప్రాణం ఉన్నంతవరకు దేశం కోసమే జీవించడమో’ అను విప్లవాత్మకమైన ప్రతిజ్ఞకు కట్టుబడి, వివాహం చేసుకోకుండా జీవితాన్నంతా దేశ సేవకై అంకితం చేసి, ఎంతో మంది పోరాట వీరులను తయారుచేసిన ప్రథమ భారత స్వాతంత్య్ర సమరయోధుడు, అధ్యాక్రాంతి గురు ‘లహుజి సాళ్వే మాంగ్’ జన్మదినోత్సవం నవంబర్ 14వ తేదీని ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంబ్లే శంకర్ మాంగ్ మాట్లాడుతూ – లహుజి సాళ్వే మాంగ్ జయంతిని అధికారికంగా నిర్వహించి, ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కోశాధికారి, గాయ్ కాంబ్లే కుషాల్ రావు మాంగ్ మాట్లాడుతూ… అందరి కంటే ముందుగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం మొదలుపెట్టిన లహుజి సేవలను గుర్తించి, ప్రతి సంవత్సరం స్వాతంత్య్రం దినోత్సవం అయిన ఆగష్టు 15 న, అందరితో పాటు అధ్యాక్రాంతి గురు లహుజి గారి చిత్రపటానికి కూడా స్థానం కల్పించవల్సిందిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వేడుక‌ల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు – గాయ్ కాంబ్లే గోవింద్ మాంగ్, హైదరాబాద్ మహానగరం అధ్యక్షులు -కాంబ్లే సుధాకర్ మాంగ్, ఉపాధ్యక్షుడు -నామ్ వాడ్ రమాకాంత్ మాంగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin