ఆగ‌స్టు 23 జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌ముఖ‌ సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు సందేశం

మన జన్నదిన ఉత్సవాలు ఉత్సాహంగా జీవించడానికి పలువురు పరస్పరం పలకరించుకుంటూ ఆత్మీయతలు అనుబంధాలు కలబోసుకోవడానికి జరుపుకోవాలి. ఇతరులకు స్పూర్తి అందించడానికి జీవితం సమీక్షించుకోవడానికి సంతోషంగా బర్త్ డేలు జరుపు కోవాలి. కొత్త బట్టలు వేసుకోవాలి. సన్నిహితులను పిలుచుకోవాలి. రచయితలైతే జన్మదిన సందర్భంగా సంచికలు ,పుస్తక ప్రచురణలు తెచ్చుకునే ప్లాన్ చేసుకోవాలి . నేను 1998లో నా 50 వ జన్మ దినాన్ని జన్మదిన స్వర్ణోత్సవంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ రచయితలు అభిమానులు 800 మందికి పైగా జగిత్యాల విచ్చేశారు
విశాల సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రారంభమై వరుసగా ప్రతి ఏటా పురస్కారాలు అందజేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లో ఘనంగా షష్టిపూర్తి .. 70 జన్మదినం సందర్బంగా ఐదు రోజులుగా సభలు సెమినార్లు నిర్వహించుకువ్నాము. 100 మందికి రాష్ట్ర స్థాయి పురస్కారాలతోపాటు 450 మందికి పైగా పురస్కారాలు సత్కారాలు ప్రోత్సాహకాలు అందుకున్నారు. ఈ సారి “బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేద్కరిజం ” పుస్తకం మీద నా జీవిత చరిత్ర పుస్తకం మీద చర్చలు సదస్సులు జరగనున్నాయి.
అందరికీ శుభాకాంక్షలు.
అభినందనలు..
ధన్యవాదాలు..

– బి ఎస్ రాములు.

By admin