HYDERABAD (Media Boss Network):
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు సమావేశమయ్యారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళసైతో కూడా విద్యాసాగర్ రావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఇరువురితో విద్యాసాగర్ రావు మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమంలో సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని పలువురు ప్రముఖులు కలుస్తున్నారు.