ఒక అతిసాధారణ వ్యక్తి.. అసాధారణ వ్యక్తి చరిత్ర తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది!?
చిత్రం పేరు: “చే” – లాంగ్ లైవ్
విడుదల తేదీ: 15-12-2023
నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్..
నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర
కో డైరెక్టర్: నాని బాబు
రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్: నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్: వివ రెడ్డి పోస్టర్స్
డీవోపీ: కళ్యాణ్ సమి, జగదీష్
ఎడిటర్: శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పీఆర్ఓ: దయ్యాల అశోక్
విప్లవం అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చే పేరు చేగువేరా. ప్రముఖ విప్లవకారుడు ఎర్నెస్టో చేగువేరా.. ధైర్యసాహసాలు, యుద్ధ నైపుణ్యం, అసాధారణ తెలివితేటలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఆయన గురించి ఎంతో చెప్పుకోవచ్చు. విప్లవ వీరుడిగా, పోరాట యోధుడిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి ఆయన చేసిన పోరాటం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అలాంటి వీరుడి జీవిత చరిత్రను తెరకెక్కించిన మూవీ “చే” – లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. డిసెంబర్ 15న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల అయింది. బి.ఆర్ సభావత్ నాయక్ తెరకెక్కంచిన ఈ సినిమా ఇటీవల ప్రచార చిత్రాలతో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఈ తరం ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుంది? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
విప్లవం బాట పట్టిన ‘చే’ (సభావత్ నాయక్) పలు దేశాలు తిరుగుతూ పీడిత జనాన్ని చైతన్య పరుస్తుంటాడు. ఒక సమయంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడతాడు. గాయపడిన ‘చే’ను ఒక గిరిజన గ్రామస్తులు కాపాడుతారు. ఆ క్రమంలో సింగి (లావణ్య) ‘చే’ను ప్రేమిస్తుంది. శరీరకంగానూ దగ్గరవుతుంది. ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం తదితర సమస్యలపై దృష్టిపెడతాడు. కేవలం కడుపు నింపుకోవటం కోసమే పని చేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పోలీసుల చేతిలో తన దళ సభ్యులు చనిపోతారు. చివరికి ‘చే’ కూడా బొలీవియా సైనిక దళాలకు బందీగా చిక్కుతాడు. ఆ తర్వాత ఏమైందీ? తను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథనం.
వైద్యవిద్యార్థిగా ఉన్న సమయంలో చెగువేరా తన మిత్రుడు అల్బర్ట్ గ్రనాడోతో కలిసి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలన్నిటినీ చుట్టాడు. ఆయా దేశాలలో తాండవిస్తున్న పేదరికం చెగువేరాను తీవ్రంగా కలచి వేసింది. భూస్వాముల, ధనిక రైతుల దోపిడీలు చెగువేరాకు ఆగ్రహం తెప్పించాయి. అమానుషమైన పెట్టుబడిదారీ వ్యవస్థ నాశనమయ్యేవరకూ పేదల బతుకులు మారవని గ్రహించాడు. అనుకున్నదే తడవు క్యూబన్ విప్లవ పోరాటంలో భాగస్వామ్యం వహించాడు. ఫిడల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవం విజయానికి వ్యూహరచన చేశాడు. క్యూబా ప్రతినిధిగా పలు దేశాలలో తిరుగుతాడు. గెరిల్లా యుద్ధతంత్రంలో చేగువేరా ఆరితేరాడు. యుద్ధభూమిలో తాను ముందు నిలబడి గెరిల్లా దళాల్ని నడిపిస్తాడు. క్యూబా పునర్నిర్మాణంతో సంతృప్తి చెందని చేగువేరా అనంతరం కాంగో, బొలీవియాల విముక్తి కోసం ఉద్యమిస్తాడు. కానీ కాంగోలో ఇతని దళంలోని విప్లవ వీరుల ప్రయత్నాలు విజయవంతం కాదు. ఎంతో మంది చనిపోతారు. ఈ కారణంగా మధ్యలోనే చేగువేరా వెనుదిరగాల్సివచ్చింది. ఆ తరువాత బొలీవియా విముక్తి పోరాటంలో పాల్గొంటాడు. చివరికి బొలీవియా సైనిక దళాలకు చేగువేరా బందీగా చిక్కుతాడు. అయినప్పటికీ శత్రువుల కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతాడు. తనను శత్రువులు చంపగలరేమోగానీ.. తన ఆశయాల్ని చంపలేరని నినదిస్తాడు. చేగువేరా కథను పూర్తిస్థాయిలో నడిపించిన విధానం చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
చేగువేరా పాత్రలో బిఆర్ సభావత్ నాయక్ నటించాడు. “నటించాడు” అనేదానికంటే “జీవించాడు” అంటే బాగుంటుందేమో. అంతేకాదు.. అచ్చం చేగువేరా ఇతడేనేమో అనుకునేలా అతని లుక్ ఉంది. ఈ తరం ప్రేక్షకులకు చేగువేరా ఎలా ఉంటాడో పూర్తిస్థాయిలో చూపించాడు. లీడ్ రోల్‌లో సభావత్ నాయక్ చెప్పిన డైలాగ్‌లు ఈ సినిమా హైలైట్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. చే కు జంటగా నటించిన లావణ్య తన పాత్రలో చక్కగా నటించింది. ఒక అందమైన అమాయకపు గిరిజన అమ్మాయిగా నటించి తన పాత్రకు పరిపూర్ణత తెచ్చింది. ఇక ఇతర పాత్రల్లో నటించిన పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్ పాయింట్‌గా నిలిచింది. రవిశంకర్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. మ్యూజిక్‌తో పాటు సరైన డీవోపీ సెట్ అవ్వడంతో కొన్ని సీన్లలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డీవోపీ అందించిన కళ్యాణ్ సమి, జగదీష్ పనితీరు బాగుంది. కొన్ని సీన్లలో అక్కడక్కడ చిన్నచిన్న కటింగ్ చేయాల్సింది. అయినప్పటికీ ఎడిటర్ శివ శర్వాణి పనితీరు పరవాలేదు.
విశ్లేషణ:
ఇండియాలోనే తొలిసారి తెలుగులో తెరకెక్కిన సినిమా అనగానే ఇండస్ట్రీలో ఒక్కసారి హాట్ టాపిక్ అయింది “చే” మూవీ. ఈ సినిమాను తెరకెక్కించిన బి.ఆర్ సభావత్ నాయక్.. ఇటీవల తన గురించి పరిచయం చేసుకున్న విషయం కూడా వైరల్ అయింది. చేగువేరా బయోపిక్‌ను సినిమాగా తీయాలని 20 ఏళ్లుగా తపించానని, తోపుడు బండిపై మరమరాలు అమ్ముతూ పైసాపైసా కూడబెట్టి సినిమా తీశానని చెప్పారు. ఒక అతిసాధారణ వ్యక్తి.. అసాధారణ వ్యక్తి చరిత్ర ఎలా తెరకెక్కిస్తాడో చూడాలన్న ఆసక్తి చాలామందిలో పెరిగిపోయింది. చేగువేరా జీవిత చరిత్రను చిన్నప్పుడే చదివి, అనేక పుస్తకాల నుంచి ఎంతో సమాచారం తీసుకున్నట్టు సభావత్ నాయక్ ఇప్పటికే చెప్పారు. అందుకే సాధారణ కథతో పాటు, చేగువేరా లైఫ్ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలను కూడా ఎంతో ఆసక్తిగా తెరకెక్కించాడు దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్. సినిమాలోని పాత్రలు ఇండియాలో మాదిరిగానే కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే గిరిజనులను పోలి ఉంటాయి. చేగువేరా బయోపిక్‌ను మన నెటివికి దగ్గరగా చూపించాలన్న ఉద్దేశంతోనే సినిమా తీసినట్టు మనకు అర్థమవుతుంది.
కథ క్రమం కూడా దారి తప్పకుండా తాను రాసుకున్నది తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. చేగువేరా చెప్పే మాటలు కూడా తూటాల్లా ఉంటాయని నిరూపించడానికి డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా రాసుకున్నాడు సభావత్ నాయక్. చేగువేరా క్యూబా, లాటిన్ అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో ఎన్నో దేశాలలో పోరాటాలకు స్ఫూర్తి అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా సూటిగా చెప్పాడు డైరెక్టర్.
అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేగువేరాను గుర్తు చేస్తాడు. అదే స్ఫూర్తితో తీశానని డైరెక్టర్ బి.ఆర్ సభావత్ నాయక్ తెలిపాడు. ఈ తరం యువతకు, చేగువేరా గురించి తెలియని వారికి మంచి ఆప్షన్ ఈ సినిమా. ప్రపంచంలో ఒక ముఖ్యమైన, అరుదైన చరిత్ర తెరపై చూసే అవకాశం ఈ సినిమా కల్పిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకునే సీన్లతో పాటు భావోద్వేగాలు ఆస్వాదించాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
రేటింగ్: 3.25 / 5
——–
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r