టైటిల్‌: కలశ
విడుదల తేది: డిసెంబర్‌ 15, 2023
నటీనటులు: భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు
నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
దర్శకత్వం: కొండా రాంబాబు
సంగీతం: విజయ్‌ కురాకుల
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ గంగధారి
ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ

బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న భానుశ్రీ ఇటీవ‌ల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. పలు టీవీ షోల్లోనూ సంద‌డి చేస్తోంది. తాజాగా భానుశ్రీ మెయిన్ లీడ్‌లో ‘కలశ’ అనే ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మాణంలో కొత్త దర్శకుడు కొండా రాంబాబు దర్శకత్వంలో భానుశ్రీ మెయిన్ లీడ్ లో సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా కలశ. ఈ సినిమా శుక్ర‌వారం (డిసెంబర్ 15న) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మ‌రి ఈ సినిమా భానుశ్రీ కెరీర్‌ను టాప్ ప్లేస్‌కు తీసుకెళ్తుందా? ఈ సినిమా ఎలా ఉంది? ఆ డీటైల్స్ ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.

కథః
తన్వి పాత్ర‌లో భానుశ్రీ న‌టించింది. సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఓ హారర్ మూవీ తీయాలని ఆస‌క్తి పెంచుకుంటుంది. దీనికోసం ఓ మంచి కథను రెడీ చేసుకొని ఓ నిర్మాతను కలుస్తుంది. అతను స్టోరీ విన్న తర్వాత క్లైమాక్స్‌ మార్చాలని సలహా ఇస్తాడు. దీంతో తన్వి హైదరాబాద్‌లో ఉన్న తన ఫ్రెండ్ కలశ (సోనాక్షి వర్మ) దగ్గరకు వెళ్తుంది. ఇంటికి వెళ్లే సరికి కలశ అక్కడ ఉండదు. తన్వి కాల్‌ చేస్తే.. పని మీద బయటకు వెళ్లాలని కాస్త లేట్‌ అవుతుందని చెబుతోంది. దీంతో తన్వి ఒక్కతే కలశ ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు అచ్చం ఆమె రాసుకున్న కథలోని ఇల్లు లాగే ఉండటం.. తన కథలో ఉన్న సీన్లే తన కళ్లముందు రిపీట్‌ కదలాడటం జరుగుతాయి. అదే ఇంట్లో ఓ అదృశ్య వ్యక్తి ఆమె కదలికలను దొంగచాటున గమనిస్తుంటాడు. అయితే కలశ చెల్లి అన్షు (రోషిణి కామిశెట్టి) తనను ఆట పట్టిస్తుందని తన్వి భావిస్తుంది. అయితే మరుసటి రోజు తన్వికి ఓ నిజం తెలుస్తుంది. కలశ, అంజు ఇద్దరూ రెండు నెలల క్రితమే చనిపోయారని.. ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదని ఆ ఇంటి పని మనిషి చెబుతాడు. అస‌లు స‌స్పెన్స్ ఇక్క‌డే మొద‌ల‌వుతుంది. మరి తన్వితో ఫోన్‌ కాల్‌ చేసిందెవరు? అంజు, కలశ ఎలా చనిపోయారు? కలశ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? రచయిత రాహుల్‌(అనురాగ్‌)తో ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మానస హత్యకు ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి? అస‌లు ట్విస్టులేంటి? ఊహించ‌ని మ‌లుపుల‌తో, స‌స్పెన్స్‌తో సాగిన ఈ సినిమా చూడాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభః
బిగ్ బాస్ ఫేం భానుశ్రీ మెయిన్ లీడ్‌లో న‌టించి మెప్పించింది. అన్ని ర‌కాల కోణాల‌ను ట‌చ్ చేసే అవ‌కాశం ఉన్న ఈ పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేసింది. అందంతో అట్రాక్ట్ చేస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక కలశగా టైటిల్ రోల్ చేసిన సోనాక్షి శర్మ ఓ పక్క గ్లామ‌ర్‌గా, మరోపక్క దెయ్యంగా క‌నిపిస్తూ భయపెడుతుంది. పోలీస్ అధికారిగా రవివర్మ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. సమీర్, అనురాగ్.. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి.

సాంకేతిక విభాగంః
ఇలాంటి సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఉండాలో అదే ఉంది. ఈ సినిమాకు విజయ్‌ కురాకుల నేపథ్యం సంగీతం కొన్ని చోట్ల భయపెట్టిస్తుంది. వెంకట్‌ గంగధారి సినిమాటోగ్రఫీ బాగుంది. రాజేశ్వరి చంద్రజ ఈ చిత్ర నిర్మాణంలో తీసుకున్న డిసీజన్స్ ప‌ర‌వాలేద‌ని చెప్పుకోవచ్చు.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. స‌స్పెన్స్, సైకలాజికల్‌ థ్రిల్లర్, హారర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలోఈ కథను ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ స‌క్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌ లో కామెడీకే ప్రాధాన్యత ఇస్తూ.. కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇంట్లో దెయ్యం సీన్స్ కొన్ని చోట్ల సిల్లీగా కనిపించినా కాస్త భయం కలిగిస్తాయి. ఇంటర్వెల్‌ సీన్‌ తో సెకండాఫ్‌పై ఆస‌క్తి నెలకొల్పి, సెకండాఫ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథను కొన‌సాగించాడు. క్లైమాక్స్ కూడా ఆక‌ట్టుకుంటుంది. ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌ను స‌స్పెన్స్‌కు గురి చేస్తూ భ‌య‌పెడుతుంది ఈ ‘కలశ’. హారర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వాళ్లకు మ‌రింతా బాగా న‌చ్చుతుంది.

రేటింగ్ః 3 / 5

 

——

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin