వైయస్సార్ లా నేస్తం నిధుల విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైయస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నామన్నారు. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నామని చెప్పారు.వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నామని వివరించారు. మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో మొత్తంగా వైయస్సార్ లా నేస్తం ద్వారా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్ రూ.49.51 కోట్లు అన్నారు. ఇలాంటి అడ్వొకేట్లకు వాళ్ల ఇనీషియల్ స్టేజ్‌లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోందని వివరించారు.