తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఓ ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలో పెద్ద‌గా ఉనికే లేని క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకునేంత బ‌ల‌హీనంగా టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఉన్నారా?. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇప్పటికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ను నియ‌మించుకున్నారు. ఇదే టీఆర్ఎస్, కెసీఆర్ బ‌ల‌హీన‌ప‌డ్డార‌నే సంకేతాల‌ను పంపింది.

ఇప్పుడు క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకోవ‌టం ద్వారా కెసీఆర్ ఇదే సంకేతాలు మ‌రోసారి ఇచ్చార‌నే చర్చ సాగుతోంది. ఇదే కెసీఆర్ గ‌తంలో క‌మ్యూనిస్టుల‌పై వ్యంగాస్త్రాలు సంధించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక క‌మ్యూనిస్టులు అయితే అధికార టీఆర్ఎస్ పై చేసిన విమ‌ర్శ‌ల సంగ‌తి స‌రేస‌రి. ఇప్పుడు అన్నీ మ‌ర్చిపోయి కెసీఆర్ పిల‌వ‌గానే చ‌లో అంటూ ప‌క్క‌న చేరారు. శ‌నివారం నాడు మునుగోడు బ‌హిరంగ స‌భ‌లోనే సీఎం కెసీఆర్ స్వ‌యంగా టీఆర్ఎస్ ఇప్ప‌టికే బ‌లంగా ఉంది అని ప్ర‌క‌టించారు. ఆసెంబ్లీలో బ‌లం అంతా..త‌మ‌ది..తమ మిత్ర‌ప‌క్ష పార్టీల‌దే అని ప్ర‌క‌టించారు. మ‌రి అంత బ‌లంగా ఉన్న‌ప్పుడు క‌మ్యూనిస్టుల పార్టీల మ‌ద్దతు టీఆర్ఎస్ కు ఎందుకు అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌టం స‌హ‌జ‌మే క‌దా. మ‌న‌కు తోడుగా లెఫ్ట్ పార్టీ మిత్రులు వ‌చ్చారు..ఇంకా చాలా మంది వ‌స్తారని ప్ర‌క‌టించారు కెసీఆర్. అంటే తెలంగాణ తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ద్ద‌తు కూడా కోర‌తారా ఏంటి అన్న చ‌ర్చ సాగుతుంది. కెసీఆర్ కు అవ‌స‌రం లేక‌పోతే అస‌లు రాష్ట్రంలో అసలు క‌మ్యూనిస్టులు ఎక్క‌డ ఉన్నారు అంటూ చాలా తేలిగ్గా తీసిపారేస్తారు.

ఇప్పుడు త‌న‌కు అవ‌స‌రం ఉంది కాబట్టి ప్ర‌గ‌తి శీల శ‌క్తులు..క్రియాశీల శ‌క్తులు ఏకం కావాలంటూ కొత్త నినాదం అందుకున్నారుని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు ఇత‌ర పార్టీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంటే అవి ఫిరాయింపులు..అక్ర‌మాలు..అదే టీఆర్ఎస్ ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంటే మాత్రం అది రాజ‌కీయ ఏకీక‌ర‌ణ. త‌న‌కు అనుగుణంగా కొత్త కొత్త సూత్రీక‌ర‌ణ‌లు చేయ‌టంలో కెసీఆర్ ను మించిన వారు లేర‌ని చెప్పొచ్చునని, మునుగోడు ఉప ఎన్నిక‌లోనే కాదు..భ‌విష్య‌త్ లోనూ టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలు క‌ల‌సి ఉంటాయన్నారు. కెసీఆర్ బ‌హిరంగ స‌భ ద్వారా రైతుల‌ను. ఇత‌ర వ‌ర్గాల‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌నే చెప్పొచ్చనని. ఎలా అంటే ఒక్క ఉప ఎన్నిక‌లో గెలిస్తేనే బిజెపి తెలంగాణ‌లో రైతుల‌తో మీట‌ర్లు పెట్టించ‌గ‌ల‌దా.. అది సాధ్యం అవుతుందా?. అంటే ఖ‌చ్చితంగా కాద‌ని చెప్పొచ్చు. కానీ బిజెపికి ఓటు ప‌డ్డ‌ది అంటే మ‌న బాయి కాడ మీట‌ర్ పడుతుంది అని రైతుల‌ను కెసీఆర్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ బిజెపి వర్గాలు సూచిస్తున్నాయి.

By admin