మ‌ల్లాపూర్: జ‌గిత్యాల జిల్లా మ‌ల్లాపూర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించి ఉచిత నేత్ర పరీక్ష శిబిరం పంప్లేట్స్ ను సిరిపూర్ గ్రామంలో సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఆగ‌స్టు 23 మంగళవారం రోజున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ వాసవి మత ఆలయం పెట్రోల్ బంక్ ముందు మల్లాపూర్ లో నిర్వహించ‌బోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, కంటి చూపు లోపాలు ఉన్నవారు, అవరమైతే కంటి ఆపరేషన్ చేస్తారని, పేషెంట్లు, వారితో వచ్చే వారికి ఉచిత భోజనం వసతి ఉన్నదని, ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఉచిత నేత్ర పరీక్ష శిబిరంకు తెల్ల రేషన్ కార్డ్,ఆధార్ కార్డ్ తీసుకురావాల‌ని మండల్ లయన్స్ క్లబ్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సిరిపూర్ గ్రామ సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్, ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయు) జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, మాజీ ఎంపీటీసీ పెంటపర్తి లక్ష్మీ అశోక్, సదుల వెంకటస్వామి, శివ శ్రీనివాస్, రుద్ర రాంప్రసాద్, ఏనుగు లక్మరెడ్డి, రిటైర్ ఉద్యోగుల అధ్యక్షులు ఉదగిరి రాజాం తదితరులు పాల్గొన్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకింగ్‌న్యూస్ కోసం ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొండి  BREAKINGNEWSAPP
ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకింగ్‌న్యూస్ కోసం ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొండి BREAKINGNEWSAPP

By admin