శ్రీవిఘ్నతేజ ఫిలిమ్స్ పతాకంపై తాండ్ర గోపాల్ నిర్మాతగా,బొమ్మారెడ్డి వి ఆర్ ఆర్ దర్శకుడిగా నిర్మించిన చిత్రం “డెడ్ లైన్”. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదల కాబోతున్న సందర్భంంగా ,చిత్రం యొక్క టీజర్ ని ,లేడీ సూపర్ స్టార్..డైనమిక్ హీరోయిన్ విజయశాంతి గారి చేతులమీదుగా విడుదల చేయడమైనది…టీజర్ విడుదలానంతరం విజయశాంతి గారు మాట్లాడుతూ..”దర్శకుడు రమణారెడ్డి నటుడిగా ఉన్నప్పటినుంచి తెలుసు..కొన్ని చిత్రాలలో కలిసి నటించాం…ఇప్పు తన దర్శకత్వంలో వస్తున్న డెడ్ లైన్ చిత్రం యొక్క టీజర్ ని నా ద్వారా విడుదలచేయడం సంతోషంగా ఉంది..ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక అకృత్యాల నేపద్యంలో చక్కటి సందేశాన్ని ఇస్తూ..మోడరన్ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ భరితంగా ఉండేలా..అందరినీ ఆకట్టుకునేలా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిచారు…ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు…దర్శకుడు మాట్లాడుతూ…”లేడీ అమితాబ్ గా పిలవబడే,లేడీ డైనమిక్ స్టార్ విజయశాంతి గారి చేతులమీదుగా డెడ్ లైన చిత్రం టీజరు విడుదలకావడం మా అదృష్టం…వారు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకు సర్వదా కృతజ్ఞులం…ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తంది..పాన్ ఇండియా విలన్ అజయ్ ఘోష్ పాత్ర వినూత్నంగా తీర్చిదిద్దడం జరిగింది..అపర్ణా మాలిక్ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది..డూప్ లేకుండా ఫైట్స్ చేసి అబ్బుర పరచింది…ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం గా రూపొందింది…నిర్మాత మాట్లాడుతూ చిత్రం అద్భుతంగా వచ్చిందని చెబుతూ…టీజర్ ని విడుదల చేసిన విజయశాంతి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు…ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సంజీవి గారు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు…
శ్రీవిఘ్నతేజ ఫిలిమ్స్
నిర్మాత.. తాండ్ర గోపాల్
రచన:దర్శకత్వం..బొమ్మారెడ్డి విఆర్ఆర్
సంగీతం.. సబు వర్గీస్
డి.ఓ.పి..మురళి వై క్రిష్ణ
ఎడిటింగ్.. మేనగ శ్రీను
లిరిక్స్.. సుద్దాల అశోక్ తేజ,విజయేంద్ర చేలో
ఫైట్స్..మల్లేష్
ప్రాజెక్ట్ కో అర్డినేటర్..గోపికర్
లైన్ ప్రొడ్యూసర్..తాండ్ర మంగ
నటీ నటులు:
అజయ్ ఘోష్
అపర్ణా మాలిక్
సోనియా
కౌషిక్
ఐశ్వర్య
గోపికర్
శ్రీనివాసరెడ్డి