టైటిల్‌: డర్టీ ఫెలో
నటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు.
నిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: జి.యస్. బాబు
దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి
సంగీతం: డాక్టర్‌. సతీష్‌ కుమార్‌.పి.
సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్‌.
ఎడిటర్‌ : జేపీ
విడుదల తేది: మే 24, 2024

యూత్‌ను ఆక‌ట్టుకునే స‌బ్జెక్టు ఉంటే సినిమా సూపర్ హిట్టే. తాజాగా యూత్‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చిన మూవీ ‘డర్టీ ఫెలో’. ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించినఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్స్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘డర్టీ ఫెలో’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో తాజాగా (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
ఈ చిత్రంలో నాగినీడు మాఫియా డాన్‌ జేపీ పాత్ర‌లో న‌టించాడు. సత్య ప్రకాష్ పాత్ర‌లో శంకర్ నారాయణ న‌టించాడు. వీరిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్‌మెంట్స్‌ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తానే మాఫీయా డాన్‌గా మార‌చ్చ‌ని శంకర్‌ నారాయణ కుట్ర ప‌న్నుతాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్‌ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్‌ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్‌ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్‌ ఇస్తాడు. కట్‌ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు. మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది. ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు ఏంటీ? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ధియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ‌:
సిద్దు, డర్టీ ఫెలో పాత్రల్లో శాంతి చంద్ర సూప‌ర్‌గా చేశాడు. రెండు కారెక్టర్ల మధ్య తేడాను స్ప‌ష్టంగా చేశాడు. యాక్టింగ్, డైలాగ్స్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అదుర్స్ అనిపించాడు. స్టైల్‌, యాక్షన్‌ తో ఈ త‌రం ఆడియన్స్‌ను మెప్పించాడ‌నే చెప్పొచ్చు. ఇక నాగినీడు చాలా రోజుల తరువాత అందరినీ ఆక‌ట్టుకున్నాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ 3పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు త‌గిన‌ ప్రాముఖ్యత ఉంది. మిగ‌తా వారు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం:
టెక్నిక‌ల్‌గా చూస్తే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా ఎక్కువగా ఔట్‌డోర్స్‌లోనే షూట్‌ చేశారు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దిన‌ట్టు క‌నిపిస్తుంది. సంగీతం బాగుంది. టైటిల్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు జీవం పోశాడు సతీష్‌ కుమార్‌. సినిమాటోగ్రఫీ సూప‌ర్.

విశ్లేషణ:
ద‌ర్శ‌కుడు తాను అనుకున్న క‌థ‌ను తెర‌పై చూప‌డంలో స‌క్సెస్ అయ్య‌డ‌నే చెప్పాలి. అయితే, స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఇంకా ఉండేది. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ ఓపెనింగ్ నుంచే పాస్టుగా వెళుతున్న‌ట్టు అనిపిస్తుంది. యాక్షన్‌, ఎమోషన్స్‌, రొమాన్స్‌తో ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్‌ సాంగ్‌… హీరోయిన్లతో రొమాన్స్‌ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్‌ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. స్విమింగ్‌ ఫూల్‌ సీన్‌ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. కాస్త భిన్న‌మైన ఈ క‌థ‌తో తీసిన ఈ సినిమాను ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

రేటింగ్‌ 3.5 / 5

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV


By admin