శంకర్ పల్లి: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) వనిత చేయూత ప్రాజెక్ట్ లో భాగంగా, రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, మోకిలా గ్రామంలో మోకిలా మహిళ శక్తి సంఘాల మహిళలకు పది కుట్టు మిషన్లు అందించిన‌ట్టు టీడీఎఫ్ వనిత చేయూత అధ్యక్షురాలు వాణి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవ‌త్స‌రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టే బాధ్యత ఈ సంఘాలకు ఇచ్చారు. మోకిలా మహిళ శక్తి సంఘాల విజ్ఞప్తి మేరకు టీడీఎఫ్‌ ముందుకు వచ్చి వారికి పది కుట్టు మిషిన్లను వితరణ చేసి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు.

ఈ సంద‌ర్భంగా టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ గవర్నమెంట్ మహిళ సాధికారత కోసం చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మోకిలా స్కూల్ హెడ్మాస్టర్ పద్మజ, వీఆర్వో సుజాత, అమ్మ ఆదర్శ కమిటీ మెంబరు పద్మ, కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుధాకర్, భీమయ్య, అనంతయ్య, అశోక్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మోకిలా మహిళా శక్తి సంఘాలు చేసిన అభ్యర్థనపై స్పందించిన టీడీఎఫ్ అవసరమైన పరికరాలను అందించేందుకు ముందుకొచ్చింది. టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి గ్రూప్ ప్రయత్నాలను కొనియాడారు. ఇలాంటి అభినందనీయమైన కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం పట్ల గర్వంగా ఉంద‌న్నారు. మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఈ ప్రాజెక్ట్ TDF USA అధ్యక్షుడు శ్రీనివాస్ మణికొండ, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి చల్లా నేతృత్వంలో TDF USA నుండి మద్దతుతో ముందుకు సాగుతోంది. ఈ చొరవను నిజం చేయడంలో వారి మద్దతు కీలకమైంది. ఈ కార్యక్రమంలో మోకిల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, వీఆర్‌వో సుజాత, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యురాలు పద్మ, సంఘం సమన్వయకర్త సుధాకర్‌, భీమయ్య, అనంతయ్య, అశోక్‌, మహిళా సంఘాల సభ్యులు, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఈ సహకారం తెలంగాణలో మహిళా సాధికారత, విద్యా వనరులను పెంపొందించడానికి బలమైన కమ్యూనిటీ ప్రయత్నానికి ఉదాహరణ.

 

 

https://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

By admin