▪️ అలరించిన పలు వినోద కార్యక్రమాలు
▪️ సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల, యాంకర్ సుమ
▪️ ‘మాటా హెల్త్ హెల్ప్ లైన్’ లాంచ్ చేసిన సుమ, శ్రీలీల
▪️ త్వరలో అన్ని రాష్ట్రాలలో MATA హెల్త్ స్క్రీనింగ్ సెంటర్స్
న్యూజెర్సీ:
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో, కళావేదిక సమర్పణలో మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీల, యాంకర్ సుమ, గెస్టు సింగర్ శ్రీనిధి తిరుమల, కల్చరల్ కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. చీఫ్ గెస్టుగా ఎడిషన్ టౌన్షిప్ మేయర్ సామ్ జోషి కార్యక్రమానికి ప్రత్యేక వీడియో సందేశం పంపించారు.
హీరోయిన్ శ్రీలీల.. తల్లితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మతో తనకున్న అనుబంధాన్ని తెలిపింది. తాను సినిమాల్లో హీరోయిన్ అయితే, తనకు మాత్రం నిజజీవితంలో తన అమ్మే హీరోయిన్ అని చెప్పింది. ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు శ్రీలీల స్టెప్పులేసి ఆహుతులను ఉత్సాహపరిచింది. యాంకర్ సుమ మహిళలతో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
ఈ వేడుకల్లో ఎన్నారైలకు హెల్త్ పరంగా హెల్ప్ చేయడమే లక్ష్యంగా సుమ – శ్రీలీల చేతుల మీదుగా ‘మాటా హెల్త్ హెల్ప్ లైన్’ లాంచ్ చేశారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రారంభమైన అనతికాలంలోనే సాధించిన మరో గొప్ప సేవా కార్యక్రమమని అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని తెలిపారు. మున్ముందు అన్ని రాష్ట్రాలలో హెల్త్ స్క్రీనింగ్ సెంటర్స్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు అందించే విధంగా MATA టీం ప్లాన్ చేస్తోందని, తొలి దశలో మూడు రాష్ట్రాలలో (అట్లాంటా, ఫ్లోరిడా, న్యూజెర్సీ) ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని శ్రీనివాస్ గనగోని తెలిపారు.
మనల్ని కనీ, పెంచీ, ఇంతవాళ్లను చేసిన అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చకోగలం? తల్లి రుణం తీర్చగల బిడ్డలెవరూ ఈ లోకంలో పుట్టలేదు. అందుకే.. కడవరకూ ఆమె ముఖంలో సంతోషం ఉండేలా చూస్తే చాలు. ఆ సంతోషానికి కారణం మనమైతే చాలు. వయసు మీద పడ్డాక బిడ్డలా చూసుకుంటే చాలు. కొంతైనా అమ్మ రుణం తీరుతుంది.. అని MATA అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని అన్నారు. మదర్స్ డే వేడుకల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ గనగోని ధన్యవాదాలు తెలిపారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి, బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్ రవికాంతి ప్రదీప్ ఈ వేడుకల్లో పాల్గొని మాతృమూర్తులందరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. కళావేదిక ప్రెసిడెంట్ స్వాతి అట్లూరి, సెక్రటరీ ఉజ్వల్ కుమర్ కస్తాల, ట్రెజరర్ రవీంద్రనాథ్ నిమ్మగడ్డ, ఈవెంట్ కో-ఆర్డినేటర్ రంజనీ ఉండవల్లి, ట్రస్టీ సాకేత్ చదలవాడ, MATA అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుద్దగి, జాయింట్ సెక్రెటరీ టోనీ జన్ను, జాయింట్ ట్రెజరర్ వెంకట్ సుంకిరెడ్డి, సెక్రెటరీ ప్రవీణ్ గూడురు, ట్రెజరర్ గంగాధర్ ఉప్పలా, నేషనల్ కోఆర్డినేటర్ విజయ్ భాస్కర్ కలల్ తదితరులు కార్యక్రమాన్ని విజయంతం చేయడంలో భాగస్వాములయ్యారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r