తెలుగుతెరపైకి మరో ఫన్నీ సబ్జెక్టుతో ఓ సినిమా వస్తోంది. అన్ని వస్తువులు EMI లో పొందుతున్న మనకు.. ఓ అమ్మాయి కూడా EMI లో దొరికితే ఎలా ఉంటుంది అనే సబ్జెక్టుతో వస్తున్న మూవీయే “EMI ఈ అమ్మాయి”.
దొంతు బుచ్చయ్య, బమ్మిడి సంగీత సమర్పణలో నోయల్ సీన్, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, చమ్మక్ చంద్ర, సత్తిపండు, ధన్‌రాజ్, భద్రం, చలాకి చంటి.. నటీనటులుగా దొంతు రమేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి. రమేష్ గౌడ్ ఈ సినిమాను నిర్మించారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ “EMI ఈ అమ్మాయి” ట్రైలర్ ను విడుదల చేసి ప్రమోషన్‌ను షురూ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు నవీన్ మేడారం, అజయ్ సామ్రాట్, గోపి గణేష్, నిర్మాత బుర్రా ప్రశాంత్ గౌడ్, హీరో, నిమ్మల శ్రీరామ్, నటి సంగీత, నటి సంధ్య జనక్, జర్నలిస్ట్ ప్రభు,నిర్మాత కీర్తి లత గౌడ్ , నటులు దిల్ రమేష్, సునామి సుధాకర్, గంగాధర్, నవీన్, క్రిష్, దర్శకుడు తండ్రి దొంతు బుచ్చయ్య, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ రాజీవ్,మోడల్ ఉదయ్ శ్రీ, బింబిసార చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి తదితరులు అతిధులుగా పాల్గొని ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సమర్పకులు దొంతు బుచ్చయ్య మాట్లాడారు.. “వివిధ దశల్లో యువతులు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలను సబ్జెక్టుగా తీసుకొని రూపొందించిన సినిమాయే “EMI.ఈ అమ్మాయి. ఈమూవీ చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాం. నటీనటులు టెక్నిషియన్స్ అందరి సపోర్టుతో సినిమా బాగా వచ్చింది. ఈ నెల మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ఆదరించండి. చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుంది..” అన్నారు
చిత్ర దర్శకుడు దొంతు రమేష్ మాట్లాడుతూ.. మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మాది వెస్ట్ గోదావరిలోని ఓ గ్రామం. మా నాన్న ఒక రైతు. నేను కన్న కలను నిజం చేయడానికి మా నాన్న నన్ను సపోర్ట్ చేశాడు. కరోనా సమయంలో ఈ చిత్రం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా నాన్న మాకు అండగా నిలబడి సినిమా ను పూర్తి చేశారు. ఇందులో నటించిన భానుశ్రీ, నోయల్ చాలా సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. కానీ సినిమా విడుదల చేయడానికి ఇబ్బంది పడుతున్న మాకు ఈస్ట్ వెస్ట్ రాజీవ్ గారు, బుర్రా ప్రశాంత్ గౌడ్ గార్లు సపోర్ట్ గా నిలబడి మాకు ధైర్యాన్ని ఇచ్చి సినిమాను రిలీజ్ చేయిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉంటే ఏ చిన్న నిర్మాత కూడా ఇబ్బంది పడరు. ఈ నెల 10 న వస్తున్న మా “EMI ఈ అమ్మాయి” సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర హీరో నోయల్ మాట్లాడుతూ.. “ఒక తండ్రి కృషి, కొడుకు ప్రయత్నం అని చాలా సార్లు విన్నాను. అయితే ఈ సినిమా ద్వారా ఈ తండ్రి కొడుకులను కళ్లారా చూశాను. చాలా మంది సినిమాల్లోకి వెళతాను అంటే ఎంకరేజ్ చేయరు. అలాంటి తన కొడుకు కలను నిజం చేస్తూ చాలా కష్టపడి నిర్మించిన చిత్రమే “EMI ఈ అమ్మాయి”. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు చిరంజీవితో చేయాలనే ఆశ ఉంటుంది. కానీ మీలాంటి దర్శక, నిర్మాతలు అవకాశం ఇచ్చినపుడు దాన్ని ప్రూవ్ చేసుకుంటేనే అలాంటి అవకాశాలు వస్తాయి. ఈ సినిమా నోయల్ చేస్తే బాగుంటుంది అని నన్ను నమ్మి ఎంపిక చేసుకొన్నందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఇక నటీ భాను చాలా హార్డ్ వర్కర్ తను ఇందులో బాగా నటించింది. ఈ సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను..” అన్నారు.
చిత్ర హీరోయిన్ భాను మాట్లాడుతూ.. “EMI ఈ అమ్మాయి.” అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆది పూర్ పీపుల్ నుండి రిచ్ పీపుల్ వరకు EMI అందరూ కడుతుంటారు. కాబట్టి “EMI ఈ అమ్మాయి” అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక భాగం. డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. వెంటనే ఒప్పుకున్నాను, మా సినిమాను మీరందరూ ఆదరించాలి..” అని అన్నారు.
నటీనటులుః
నోయల్ సీన్, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, చమ్మక్ చంద్ర, ధనరాజ్, భద్రం, చలాకి చంటి, సత్తి పండు, హరితేజ, మహేష్, చందన తదితరులుసాంకేతిక నిపుణులు
బ్యానర్: శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్
నిర్మాత: డి. రమేష్ గౌడ్
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: దొంతు రమేష్
సినిమాటోగ్రఫీ: యం.మోహన్ చంద్
సంగీతం: రవిశంకర్
ఎడిటర్: ,నందమూరి హరి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీ మణి, చిర్రవూరి విజయ్ కుమార్,
డైలాగ్స్: గటికాచలం, కేశవ కొన,
కో డైరెక్టర్: కే. శ్రీనివాస రావ్
ఆర్ట్స్: ఎమ్మెస్ వాసు
పీఆర్వో: హరీష్, దినేష్
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews