నటీనటులు: ప్రియద‌ర్శి, కావ్యాక‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూపలక్ష్మి, వేణు టిల్లు, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు
సమర్పణ: శిరీష్
ఛాయాగ్రహణం: ఆచార్య వేణు
పాటలు: కాసర్ల శ్యామ్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాత‌లు: హర్షిత్ రెడ్డి, హన్షిత
ద‌ర్శ‌క‌త్వం: వేణు టిల్లు (వేణు యెల్దండి)
విడుదల తేదీ: మార్చి 3, 2023

కామెడీ యాక్ట‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన నటుడు వేణు టిల్లు. ‘బలగం’ సినిమా (Balagam)తో దర్శకుడిగా మారారు. ‘దిల్’ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

స్టోరీ:
సాయిలు (ప్రియదర్శి) పెళ్ళికి సిద్ధమ‌వుతాడు. రెండు రోజుల్లో వరపూజ(నిశ్చితార్థం) ఉండ‌గా.. తాతయ్య (సుధాకర్ రెడ్డి) మరణిస్తాడు. వరపూజ రోజున పది లక్షల కట్నం వస్తే అప్పు తీరుద్దామని అనుకున్న అతని ప్లాన్ బెడిసి కొడుతుంది. చావు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆ పెళ్ళి ఆగిపోతుంది. క్యాన్సిల్ అవుతుంది. తాతయ్య భౌతికకాయం చూడటానికి వచ్చిన మేనత్త కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్)ను చూస్తాడు. మావయ్యకు బోలెడు ఆస్తి ఉందని తెలుస్తుంది. సంధ్యను ప్రేమలో పడేసి, పెళ్ళి చేసుకుంటే అప్పు తీరుతుందని ప‌థ‌కం వేస్తాడు. అయితే… సాయిలు తండ్రి (జయరాం)కి, మావయ్య (మురళీధర్)కు మధ్య గొడవలు ఉంటాయి. ఆ గొడవలకు కారణం ఏమిటి? ఐదొద్దుల‌కు కాకి ఎందుకు ముద్ద (మరణించిన వ్యక్తులకు పెట్టే భోజనం) ముట్టలేదు? తాతయ్య ఆత్మ కోరుకున్నది ఏమిటి? అందుకోసం గొడవల్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులు ఏం చేశారు? అనేది సినిమా.

నటీనటుల ప‌నితీరు:
‘బలగం’లో నటీనటులు కనిపించలేదు. పాత్ర‌లు మాత్రమే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ జీవించారు అని చెప్పొచ్చు. ప్రియదర్శి హీరోగా చేయలేదు. పాత్రలో లీన‌మ‌య్యాడు. కావ్యా కళ్యాణ్ రామ్ చూడ‌టానికి బాగుంది. ఎమోషన్స్ కూడా బాగా చూపించింది. తాతయ్య క్యారెక్టర్ చేసిన పెద్దాయన సుధాకర్ రెడ్డిని సినిమాకు శిఖ‌రంలా క‌నిపిస్తాడు. కనిపించేది కొన్ని సన్నివేశాలే అయినప్పటికీ కథపై ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. మిగతా న‌టీన‌టులు తమతమ పాత్రలకు జీవం పోశారు. యాక్ట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా మాత్రమే కాదు.. ప్ర‌ధాన‌ సన్నివేశాల్లో గాయకుడిగా కూడా వేణు ప్ర‌తిభ ఆకట్టుకుంటుంది. భావోద్వేగ స‌న్నివేశాల‌కు త‌న గొంతుతో ప్రాణం పోశాడు. వేణు టిల్లు చేసిన క్యారెక్టర్ సూప‌ర్ అనే చెప్పాలి.

ఎమోష‌న్‌కు భాష, యాస అడ్డం కావు. కొన్నిసార్లు యాక్ట‌ర్స్ మాట్లాడే భాష ఆడియ‌న్స్‌కు అర్థం కాకున్నా కూడా చప్పట్లు కొట్టారంటే కారణం ఆయా సినిమాల్లో భావోద్వేగమే. ‘బలగం’ చిత్రానికి పని చేసిన బృందమంతా తెలంగాణ బిడ్డలే. సినిమాలోనూ తెలంగాణ యాస వినిపిస్తుంది. భావోద్వేగాలు మాత్రం మనుషులు అందరి హృదయాలు తాకే విధంగా ఉన్నాయి. ‘బలగం’ బలం అంతా భావోద్వేగాల్లో, కాసర్ల శ్యామ్ సాహిత్యం, భీమ్స్ సంగీతంలో ఉంది. భావోద్వేగం అంటే కంటతడి మాత్రమే కాదు, నవ్వడం కూడా. అటువంటి భావోద్వేగాలను పట్టుకోవడంలో వేణు యెల్దండి సక్సెస్ అయ్యారు. చావు ఇంట్లో, మరణించిన మనిషి ముందు కొందరి ప్రవర్తన నవ్విస్తుంది. ఆ సీన్ల‌ను చక్కగా రాసుకున్నారు. ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ చాలా పెక్యులర్ గా ఉంటుంది. కొత్త ఎమోషన్స్ చూపించలేదు. కానీ, కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు.

అన్నాచెల్లెళ్ళ మధ్య బాండింగ్ చెప్పే సీన్, పొలం దగ్గర తాతయ్యకు ఇష్టమైన ప్రదేశంలో ప్రియదర్శి ఎమోషనల్ అయ్యే సీన్, ప్రింటింగ్ ప్రెస్‌లో హీరోయిన్ సీన్  చెబుతూ వెళితే ఇటు  వంటి కొన్ని సీన్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. విడివిడిగా చూస్తే కొత్త సీన్లు ఏమున్నాయి? అనిపిస్తుంది. కాకి ముద్ద ముట్టడం, హీరో తండ్రి & మావయ్య మధ్య గొడవ చుట్టూ ఎక్కువ సేపు కథ తిరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత, ముందు కొంత నెమ్మదిస్తుంది. అయితే, సినిమా అంతటినీ ఒక్కటిగా చూస్తే ఒక ఎమోషన్ క్యారీ అయ్యింది. అందుకు ముఖ్య కారణం సంగీతం, సాహిత్యమే. తాతయ్య మనసులో బాధను ఇంకా బలంగా ఆవిష్కరించి ఉండుంటే బావుండేది. అప్పుడు ఇంకా డెప్త్ ఎక్కువ ఉండేది.

తెలంగాణ పల్లె వాతావరణాన్ని, సంస్కృతిని ఆవిష్కరించే విధంగా కాసర్ల శ్యామ్ పాటలు రాశారు. భీమ్స్ సంగీతం అందించారు. ‘ఊరు పల్లెటూరు…’ పాట ఇంకా కొన్నాళ్ళు వినబడుతుంది. ఆచార్య వేణు సినెమాటోగ్రఫీ బావుంది. సంభాషణల్లో తెలంగాణ యాస, ఆ సహజత్వం బావున్నాయి.

తెలంగాణ యాస, భాష, సంస్కృతికి పట్టం కట్టిన సినిమాల్లో ‘బలగం’ ఒక్కటిగా నిలుస్తుంది. యాసను మించిన ఎమోషన్ సినిమాలో ఉంది. మనుషులు జీవించి ఉన్నప్పుడు వాళ్ళను ప్రేమగా చూసుకోమనే మెసెజ్‌ను ఇస్తుంది. ఇది తెలంగాణ మట్టిలో కథ, మనుషుల కథ, మనల్ని మనకు తెరపై చూపించే కథ. నటీనటుల ప్రతిభ, వేణు దర్శకత్వం, భీమ్స్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం.. ఇలా ‘బలగం’ చిత్రంలో భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించాయి. ఆడియ‌న్స్‌ను మెప్పించాయి.

రేటింగ్ : 3/5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin