నటీనటులు:
రాజు గౌతమ్ (మణిరత్నం)
చక్రపాణి ఆనంద (వెంకటేశ్వరరావు పాత్ర)
సినిమా శ్రీను (మెకానిక్ రాజు)
కిరీటి (సైకాల‌జిస్టు)

రచన & దర్శకత్వం : సుబ్బు చెరుకూరి
నిర్మాత: అనిల్ మోదుగ
బ్యానర్ – అనిల్ మోదుగ ఫిల్మ్స్ #anilmodugafilms
సహ నిర్మాతలు: బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల
DOP – మోహన్ చారి
సంగీతం – M.S జోన్స్ రూపర్ట్
చీఫ్ ఎడిటర్: TheRevengerz
ఎడిటర్: అర్జున్ – బసవ
VFX: రాజ్ పవన్ కొమ్మోజు (ఐరేంద్రి స్టూడియోస్)
సౌండ్ డిజైనర్ – సాయి మనీంధర్ రెడ్డి
సౌండ్ మిక్స్ – అరవింద్ మీనన్
ఆర్ట్ డైరెక్టర్: కొయ్యలమూడి రాకేష్ (నాని)
కలరిస్ట్: అన్వేష్ పాతూరి
అసోసియేట్ కెమెరామెన్: చెంచు జె

 

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘బ్రేక్ అవుట్’. అనిల్ మోదుగ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కిన‌ ఈ చిత్రం సర్వైవల్ హారర్ జానర్ లో వ‌చ్చింది. గ‌తంలో విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్స్ వైర‌ల్‌గా మారి, ఆస‌క్తిక‌రంగా, విప‌రీత‌మైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా (2023, ఫిబ్ర‌వ‌రి 24న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? రాజా గౌతమ్ హిట్ కొట్టాడా? లేదా? రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌:
మణిరత్నం ఒక ఔత్సాహిక చిత్ర ద‌ర్శ‌కుడు. అతను మోనోఫోబియా అనే వ్యాధితో బాధపడుతుంటాడు. తన స్నేహితుడితో కలిసి నివసించిన‌ పాత గ్యారేజీలో రాజు అనే మెకానిక్.. మ‌ణిర‌త్నంకు ఒక రోజు ఆశ్రయం ఇస్తాడు. రాజు మణిరత్నాన్ని ఒంటరిగా వదిలి ఏదో పని మీద బయటకు వెళ్తాడు. ఒక గంటలో గ్యారేజ్‌కి తిరిగి వస్తానని మణిరత్నంకు హామీ ఇస్తాడు.

మణిరత్నం గ్యారేజీలో తనను తాను నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన ఫోబియాను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతను ఊహించ‌ని ప‌రిస్థితుల్లో ఆ గ్యారేజ్‌లో లాక్ అవుతాడు. మ‌రి మణిరత్నం ఎలా లాక్ అయ్యాడు? అతనికి ఏమి జరిగింది? త‌న‌కున్న ఫోబియా అతనిని ఎలా ప్రభావితం చేసింది? అతను ఎలా బ‌తికాడు? అనేదే ఈ సినిమా క‌థ‌.

న‌టీన‌టుల ఫ‌ర్మార్మెన్స్:
ఒక ఔత్సాహిక చిత్ర ద‌ర్శ‌కుడిగా మణిరత్నం పాత్ర‌లో రాజు గౌత‌మ్ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. సినిమా అంతా తానై నడిపించాడు. ఫోబియాతో ఎదుర్కొన్న ప‌రిస్థితులు వ‌చ్చే పలు సీన్ల‌లో చాలా బాగా న‌టించాడు. ఇక వెంక‌టేశ్వ‌ర రావు పాత్ర‌లో చ‌క్ర‌పాణి ఆనంద త‌న పాత్ర ప‌రిధి మేర న‌టించి మెప్పించాడు. ఇక మెకానిక్ రాజు పాత్ర‌లో చిత్రం శ్రీను యాక్టింగ్ ఎక్స్‌లెంట్. సైకాల‌జిస్టు పాత్ర‌లో న‌టించిన‌ కిరిటీ యాక్టింగ్ ప‌ర‌వ‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు.

టెక్నిక‌ల్ టీమ్:

టెక్నికల్ టీం:
ప్రొడ్యూసర్ అనిల్ మోదుగ ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. డైరెక్టర్ వర్క్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. తను రాసుకున్న కథను అద్భుతం గా తెరకెక్కించారు ఈ నూతన దర్శకుడు. ఆడియెన్స్ లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. MS జోన్స్ రూపర్ట్ మ్యూజిక్ తో మేజిక్ చేసారు. సినిమా మూడ్ కి తగ్గట్టుగా మోహన్ చారి మంచి విజువల్స్ అందించారు. రేవెంజర్స్ ఎడిటింగ్ చాలా క్రిస్పీ గా ఉంది.

విశ్లేష‌ణ:
మోనోఫోబియా అనే మానసిక రుగ్మత ఉన్న వారికి ఒంటరిగా గడపడం అంటే తీవ్ర ఆందోళనకరంగా ఉంటుంది. అయితే, గ్యారేజ్‌లో ఒంటరిగా చిక్కుకున్న అత‌డి ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మే. అలాంటి ఉత్కంఠ‌ను క్రియేట్ చేయ‌డంలో సుబ్బు చెరుకురి రాసుకున్న క‌థ స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి. ఈప్ర‌యోగాత్మ‌ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది. ప్రేక్ష‌కుడికి గంద‌ర‌గోళం లేకుండా, ఉత్కంఠ‌గా క‌థ న‌డిపించిన తీరు బాగుంది. అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంద‌ని చెప్పొచ్చు.

రేటింగ్: 3.5/ 5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

—————————-

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin