Hydearabd (MediaBoss Network):

 మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అబద్దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే “అవసరానికో అబద్దం”. ఝాన్సీ, కృష్ణమూర్తి యలమంచిలి సమర్పణలో, గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ శివకుమార్ చికిన సహకారంతో త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా ఆయాన్ బొమ్మాళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ జై యలమంచిలి నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమ‌య్యాయి.

ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సురేష్ బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దామోదర్ కోలేటి, చిత్ర నిర్మాత తమ్ముడు రమేష్ యలమంచిలి, విజయవాడ తూర్పు వై. సి. పి. ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సెక్రటరీ నాగభూషణం పాతూరి, బీజేపీ నేషనల్ ఫైనాన్సియల్ స్పోక్ పర్సన్ లంకా దినకర్, రాజేంద్ర ఎనిగల్ల, శంకర్ చెన్నంశెట్టి చీఫ్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాత సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు ఆయాన్ బొమ్మాళి మాట్లాడుతూ.. ” ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధం అనేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎంతగా అంటే చిన్నప్పుడు గోరుముద్దలు తినకపోతే బూచోడు ఎత్తుకు పోతాడు అని అమ్మ చెప్పే అబద్దం నుండి, మనం చనిపోయేముందు మనం బెడ్ మీద ఉన్నప్పుడు కూడా డాక్టర్ వచ్చి నీకేం కాదని చెప్పే ధైర్యం వరకు, మనిషి జీవితంలో అబద్దానికి చాలా ఇంపార్టెంట్స్ ఉందని చెప్పే మెసెజ్ ఓరియంటేడ్ మూవీ “అవసరానికో అబద్దం”. అలాగే మహాభారతంలో కృష్ణుడు అవ‌స‌ర‌మైన సందర్భాల్లో అబద్దం ఆడవచ్చు అని చెప్పాడు. దానిని ఆదర్శంగా తీసుకొని కమర్శియల్ కంటెంట్ వేలో సినిమాటిక్ గా సినిమా తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుందనే ఆలోచ‌న‌తో చేసిన స్టోరీ ఇది. ధర్మం కాపాడాలి అంటే ధర్మ రాజు తోనే అబద్ధం ఆడించాలనే స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. మణిశర్మ మా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ ఖ‌చ్చితంగా నచ్చుతుంది..” అన్నారు.

చిత్ర నిర్మాతలు కృష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్ జై యలమంచిలి మాట్లాడుతూ.. ”మా సినిమాని బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత సురేష్ బాబు గారికి, దామోదరప్రసాద్ గారికి, దిల్ రాజు గారికి, దామోదర్ పోలేటి కు, నాగభూషణంకి ఇంకా మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీ కి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు. వవీరే కాకుండా యస్. వి. రంగారావు గారు, కె. విశ్వనాధ్, కెవి. రెడ్డి, సి. నారాయణ రెడ్డి, దాసరి నారాయణ, రాఘవేంద్ర రావు వారి తరువాత తరం వారు చేసిన కృషి వల్లే ఈ రోజు చిత్రసీమ ఇంత డెవలప్ అయ్యింది. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇదే సినిమా ఇండస్ట్రీలో నేను పెరిగిన వాణ్ని. ఏ టెంపుల్ కు వెళ్లినా, చర్చి కి వెళ్లినా మసీద్ కు వెళ్లినా అందరూ ధర్మో రక్షిత రక్షితః అంటాము. ధర్మాన్ని గెలిపించాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న ఈ ఒక మంచి ప్రయత్నం “అవసరానికో అబద్ధం”. ఈ సినిమాకి నాంది పలికింది దర్శకుడు బొమ్మాళి. తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేక్షకులకు కావలసిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి. సినిమాకు తగ్గట్టు మంచి ఎనర్జీటిక్ ఉన్న హీరోహీరోయిన్ లతో పాటు ఎగ్జిక్యూటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో మాకు మంచి టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.

చిత్ర హీరో త్రిగున్ మాట్లాడుతూ.. ”ఇప్పటి వరకు చాలా క్రాస్ జోనర్ సినిమాలు చేశాను. దర్శకుడు ఆయాన్ బొమ్మాళి చెప్పిన కథ కొత్త‌గా అనిపించడంతో ఈ సినిమాకు ఒప్పుకున్నాను. మా గురువు మణి శర్మ నాకు 2022 లో ”పదములే లేవు పిల్ల” వంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చాడు. మళ్ళీ తను ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్తాడని కోరుకుంటున్నాను. మా నిర్మాత డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలికి సినిమా అంటే ప్యాషన్. మంచి కథను సెలెక్ట్ చేసుకోని తీస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి, దర్శకులు బొమ్మాళికి నా ధన్యవాదములు”.

చిత్ర హీరోయిన్ రుబాల్ షేక్ రావత్ మాట్లాడుతూ.. ”ఇలాంటి మంచి సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు” అన్నారు.

నటీనటులు:
త్రిగున్, రుబాల్ షేక్ రావత్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత: డాక్టర్ జగదీష్ యలమంచిలి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్: ఆయాన్ బొమ్మాలి
మ్యూజిక్ః మణిశర్మ
సినిమాటోగ్రాఫర్: సీహెచ్ మోహన్ చారి
ఎడిటర్: జానకిరామ్
లిరిక్స్: అనంతశ్రీరామ్
ఆర్ట్: హేమంత్ కుమార్ జి
పీఆర్వో: హరీష్, దినేష్

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

By admin