- నా కెరీర్‌లో మరో మైలురాయి ‘తారకాసురుడు’ చిత్రం
- నా ప్రతిభను గుర్తించి సినీ బాట వేశారు దాసరి
- పలు భాషల్లో అన్ని రకాల పాటలు రాశాను, పాడాను
- ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతున్నాను
- పాటల రచయిత, గాయకుడు, నటుడు వరంగల్ శ్రీనివాస్
తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టుకు రంగు రంగుల పూలిస్తున్నాడు. ఆయన కలంలో అన్ని రసాలు కలగలిపిన సిరా ఉంటుందేమో అన్నట్టుగా.. ఏ భావాన్నైనా, ఏ సందర్భాన్నైనా పాటగా అల్లుతాడు. గుండెకు హత్తుకునేలా రాసి ఎక్కడికో తీసుకెళ్తాడు. మళ్లీ మళ్లీ వినేలా తన పాటతో మనల్ని పరవశింపజేస్తాడు. పాటల రచయిత, గాయకుడు, నటుడు వరంగల్ శ్రీనివాస్ ‘తారకాసురుడు’ చిత్రంతో సంగీత దర్శకునిగా ప్రస్థానం మొదలుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.
ప్రశ్న: మల్టీటాలెంట్ చూపిస్తున్న మీరు ‘తారకాసురుడు’ చిత్రంతో సంగీత దర్శకునిగా కూడా మారుతున్నారు. ఈ క్రమం వివరిస్తారా.?
సమాధానం: దర్శకరత్న దాసరి నారాయణ రావు ప్రొత్సాహంతో నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. నా ప్రతిభను గుర్తించి సినీ రచయితగా నాకు తొలి అవకాశం ఇచ్చారు. ”వీడు నా బిడ్డ.. వీడి పొట్ట నిండా పాటలే..” అని దాసరి నన్ను అనే వారు. దర్శకుడు వి. సముద్ర కూడా దాసరి శిష్యుడే. తాజాగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తారకాసురుడు’ చిత్రంతో ఆయన నన్ను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. దాసరి తరహాలోనే వి. సముద్ర దగ్గర పని చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి ప్రకృతి ఒడిలో పెరిగిన నాకు పల్లెటూళ్లలో ఎన్నో పాటలు వినేవాడిని. వాళ్లు సంగీతం నేర్చుకోకపోయినా అద్భుతంగా పాడుతారు. మట్టిలో ముట్టుకుంటే పాట వస్తుంది. ఆ క్రమంలో నేను అమ్మ పాట ఒడిలో పెరిగాను. అలా నన్ను సంగీత దర్శకున్ని చేసింది కూడా అమ్మ పాటే. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాను.
ప్రశ్న: మీ నేపథ్యం గురించి వివరిస్తారా?
సమాధానం: మాది వరంగల్ జిల్లా తక్కెళ్లపాడు గ్రామం. ప్రకృతి ఒడిలో, పాటల పూదోటలో పెరిగాను. మా అమ్మ, మా మేనత్తలు కూడా జానపదాలను చక్కగా ఆలపించేవారు. దుక్కి దున్నేటప్పుడూ నారు పోసేటప్పుడూ వడ్లు దంచేటప్పుడూ తిరగలి తిప్పేటప్పుడూ జోల పాడేటప్పుడు.. ఇలా పని జరుగుతున్న ప్రతి చోటా ఊళ్లో పాటలు వినే వాడిని. వాళ్లతో పాటు గొంతు కలిపేవాడిని. అలాంటి వాతావరణంలో పెరిగాను. అలా పాట అనేది నా జీవితంలో భాగం అయిపోయింది.
ప్రశ్న: ఎప్పటి నుంచి సొంతంగా పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టారు?
సమాధానం: ఏడోతరగతిలోనే సొంతంగా పాట రాశాను. రాసిన తొలి పాటకే ప్రథమ బహుమతి వచ్చింది. అప్పట్నుంచి నా రచనా ప్రస్థానం మొదలైంది. పల్లె జానపదాల బాణీలను తీసుకొని ప్రస్తుత సమస్యలపై సొంతంగా పాటలు రాశాను. అలా 93 అణగారిన జాతులపై పాటలు రాశాను. కమ్యూనిస్ట్, మావోయిస్ట్, సోషలిస్ట్… ప్రజాకళాలను ఆకలింపు చేసుకున్నాను.
ప్రశ్న: మీరు ఎన్నిభాషల్లో పాటలు రాశారు?
సమాధానం: తెలుగు మాత్రమే కాదు నాకు ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. బెంగాలీ, అస్సామీ, ఒరియా, లంబాడీ, కోయ, గొండు.. ఇలా పలు భాషల్లో ఎన్నో పాటలు రాయడమే కాదు, సొంతంగా పాడాను కూడా.
ప్రశ్న: సినీ గీతరచయితగా మీరు ఎక్కువ పేరు పొందిన పాటలు చెబుతారా?
సమాధానం: సినీ రచయితగా తొలి అడుగు వేసింది దాసరి నారాయణ రావు చిత్రం ద్వారానే. ‘అడవి చుక్క’ చిత్రంలో ‘తయ్యుందత్తై.. తయ్యుందత్తై నేను రాసిన తొలి పాట. అదే సినిమాలో రాసిన ‘ఎవరు అన్నారమ్మ మేమూ.. గరీబోళ్లనీ’ పాటైతే పెద్ద హిట్. అలాగే దాసరి ‘చిన్నా’ చిత్రంలో నేను రాసిన ‘గువ్వా గువ్వా ఎగిరేటి గువ్వా ఏడికే సిరిసిరి మువ్వా’ పాట విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్.నారాయణమూర్తి కూడా ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చలో అసెంబ్లీ, వేగుచుక్కలు, ఊరు మనదిరా, అడవిబిడ్డలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, అమ్మమీద ఒట్టు సినిమాలతో పాటు ‘నిర్భయభారతం’ చిత్రానికి కూడా పాటలు రాశాను. ఇందులో అడవిబిడ్డలు, వీరతెలంగాణ.. వంటి సినిమాల్లో నటించాను కూడా. ఎర్ర సినిమాలే కాక, ఫూల్స్, ఆయుధం, ఈ వయసులో, రెండేళ్ల తర్వాత, రఘుపతి లాంటి వాణిజ్య సినిమాలకు కూడా పాటలు రాశాను.
ప్రశ్న: పాటల్లో మీరు చేస్తున్న ప్రయోగాలు చెబుతారా?
సమాధానం: వచ్చే జనరేషన్ వాళ్లకు కూడా నచ్చేలా నా బాణీలను సిద్ధం చేసుకోవడం నాకు అలవాటు. ఇక గతంలో నేను చేసిన ఉద్యమ పాటలు కూడా నాకు మంచి పేరు తీసుకువచ్చాయి. నేను పాటలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధించడంతో వారికి నా పాటలపై మంచి సెంటిమెంట్ ఉంది. అదే క్రమం సినిమాల్లోనూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు సంగీత దర్శకునిగా కూడా ‘తారకాసురుడు’ చిత్రం కోసం పాటలకు ప్రయోగాలు చేశాను. ఈ సినిమా పాటలు కూడా మంచి హిట్టు అవుతాయని నమ్మకం ఉంది.
మీ సమయాన్ని వెచ్చించి ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సంగీత దర్శకునిగా మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.
–
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews