కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా తెరకెక్కిన మూవీ ‘జ్యువెల్ థీఫ్’. Beware of Burglar అనేది స‌బ్ టైటిల్. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టీన‌టులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

సెన్సార్ పూర్తి అయిన సంద‌ర్భంగా 30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ.. ”యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసినందుకు సెన్సార్ బోర్డు స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు. ‘జ్యువెల్ థీఫ్’ హీరో కృష్ణసాయి యాక్షన్ పార్టులు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.” అన్నారు.

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు ప్ర‌శంస‌లు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్రేమ గారితో క‌లిసి ఈ సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది.” అన్నారు.

నటీనటులు:
హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, స‌మ్మెట గాంధీ, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే, ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:
పీఎస్ నారాయణ

డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ : జేపీ
ఫైట్ మాస్టర్: రమణ
డాన్స్: స్వర్ణ, యాని
లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ
మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ,
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఆర్ట్ డైరెక్టర్ కె.మురళీధర్,
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

 

 

By admin