అన్నివర్గాల సేవకుడు

అందరం కలలు కంటాం.. కొందరే వాటిని నిజం చేసుకుంటారు.. అందుకోసం ఎంతటి కష్టాన్నైనా.. నష్టాన్నైనా పంటికింద అదిమిపట్టి ముందుకు సాగుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే మన చెరుకు కరణ్‌ రెడ్డి గారు. చిన్నానాటి నుంచే ప్రజాసేవలో తరిస్తూ వస్తున్న కరణ్‌రెడ్డి.. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి పార్లమెంట్‌కు వెళ్లేందుకు కలలు కన్న కరణ్‌రెడ్డి.. ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ధర్మాన్ని రక్షించడంలో ముందుండే చెరుకు కరణ్‌రెడ్డి గారు.. హిందూ ధార్మిక సంబంధ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ హిందూ బంధువులను ఏకం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. హిందువులను కాపాడేందుకు హిందువుగా వస్తానంటూ.. హిందూ బంధువులకు ఏ కష్టమొచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చే కరణ్‌రెడ్డి గారు ఎందరికో ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి ఔచిత్యం లేదు.

జర్నలిస్టులుగా విశేష సేవలందించిన కరణ్‌రెడ్డి గారు.. ఎందరో రాజకీయ నాయకులకు వ్యూహకర్తగా పనిచేసి వారి విజయంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణలో కేసీఆర్‌ స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి.. ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌కు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా ఉండి ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు అవిరళ కృషి సల్పారు. కరణ్‌రెడ్డి గారి మార్గదర్శనంలో పనిచేసిన ఎందరో అభ్యర్థులు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకుని అసెంబ్లీ గడప తొక్కారు.

హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్‌గా శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్ల పర్యవేక్షణలో ధర్మ సంస్థాపనకు కృషి చేసిన కరణ్‌రెడ్డి గారు.. తన పాదయాత్రలో భాగంగా 7500 కిలోమీటర్లు నడిచి దాదాపు 1000 కి పైగా ఆలయాలను సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పనితీరుకు ఆకర్శితుడైన కరణ్‌రెడ్డి.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. హిందూ బంధువుగా, ధర్మ రక్షకుడిగా, ప్రజా సేవకుడిగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతున్న చెరుకు కరణ్‌రెడ్డిని మనమంతా ఆశీర్వదిద్దాం.. ఆయన ఆశయసాధనలో మనమంతా పాలుపంపచుకుందాం.. ఆయనతోపాటు అడుగులేద్దాం.. హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగిద్దాం..
జై హింద్‌.. జై భారత్‌..

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

By admin