మూడు రాష్ట్రాలలో వేడుకలు
జోహనెస్బుర్గ్: తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు సౌత్ ఆఫ్రికాలో మూడు రాష్ట్రాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం BRS సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని మూడు రాష్ట్రాలు జోహనెస్బుర్గ్ లో న్యూ జెరూసలేం చిల్డ్రన్ హోమ్ లో అన్నదానం, సరుకుల పంపిణి జరిగింది. పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసారు. కోర్ కమిటి సభ్యులు, కమ్యూనిటీ సభ్యులు పిల్లలకి భోజనం వడ్డించారు. అందరితో కలిసి కేసీఆర్ జన్మదినాన్ని జరుపుకున్నారు. Capetown లో షిలొహ్ సినర్జీ పూర్ కమ్యూనిటీస్ ఆశ్రమములో నిత్యా అవసర సరుకుల్ని అందజేశారు. డర్బన్ లో St థామస్ హోమ్ ఫర్ చిల్డ్రన్ లో నిత్యా అవసర సరుకుల్ని అందజేశారు. ఈ చారిటీ కార్యక్రమానికి జొహాన్నెస్‌బర్గ్ లో వెంకట్ రావు తాళ్లపల్లి, capetown వీరన్న గాండ్ల, డర్బన్ లో సంతోష్, షేక్ బాబాకి ముందుండి నడిపించినందుకు గుర్రాల నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో మేడసాని నరేందర్ రెడ్డి,హరీష్ రంగ, సాయి కిరణ్ నల్ల, నరేష్ తేజ,కాశీ,అనిత(మధ్య ప్రదేశ్), పేర్ల ప్రసాద్, సాయి చిట్టంపల్లి, వంసి వేయిశెట్టి, కళ్యాణ్ బత్తిన, తలసాని శ్రీనివాస్ రెడ్డి, మర్రు సతీష్, అరవింద్ జయారపు, కుమార్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews