మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనే విష‌య‌మే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ మినహా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు టికెట్‌ ఆశిస్తున్నవారిపై సర్వేలు నిర్వహిస్తోంది. సామాజిక, ఆర్ధిక, ఇతర అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. పార్టీ ప్రాబల్యానికి తోడు అభ్యర్థి అదనపు బలం కావాలని ఆశిస్తున్నాయి. అయితే సర్వేల్లో తమకు అనుకూలంగా రిపోర్ట్ వస్తే టికెట్‌ ఇవ్వాలని చూస్తున్నాయి. అయితే పలు కీలక అంశాలను అన్ని పార్టీలు భేరీజు వేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు..? ఏ కులస్తుల ఓట్లు ప్రభావం చూస్తాయి? బీసీల ఓట్లు ఎన్ని? ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎలా ఉన్నాయనే అంశంపై చర్చ జరుగుతున్నాయి. ఇదే అంశంపై ఆ నియోజకవర్గంలో వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం ఓటర్లు -2,20,520..
మునుగోడులో కులాల వారీగా ఓట్లు ఇలా..

1. గౌడలు –  35,150 (15.94 శాతం)

2. ముదిరాజ్ లు – 33,900 (15.37 శాతం)

3. ఎస్సీ మాదిగ – 25,650 (11.63 శాతం)

4. యాదవ –  21360 (9.69 శాతం)

5. పద్మశాలీ –  11,680 (5.30 శాతం)

6. ఎస్టీ లంబాడీ – ఎరుకల-10,520 (4.77 శాతం)

7. ఎస్సీ మాల – 10,350 (4.69 శాతం)

8. వడ్డెర – 8350 (3.79 శాతం)

9. కుమ్మరి –  7850 (3.56 శాతం)

10. విశ్వ బ్రాహ్మణ –  7,820 (3.55 శాతం)

11. రెడ్డి –  7,690(3.49 శాతం)

12. ముస్లింలు –  7,650 (3.47 శాతం)

13. కమ్మ –  5,680(2.58 శాతం)

14. ఆర్యవైశ్య –  3,760 (1.71 శాతం)

15. వెలమ –  2,360 (1.07 శాతం)

16. మున్నూరు కాపు –  2,350(1.07శాతం)

17. ఇతరులు  –  18,400( 8.34 శాతం)

మొత్తానికి సామాజిక వర్గాల సమీకరణాలు, ఇతర పార్టీల అభ్యర్థులను పరిశీలించిన తర్వాతే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. సర్వేలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని రెండు పార్టీల హైకమాండ్‌లు చెబుతోంది. మొత్తానికి ఇలా కులాలవారీగా ఎంత లాభం చేకూరుతుందో పక్కాగా లెక్కలు వేసుకొని మరీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారట అన్ని పార్టీల పెద్దలు. కులలవారిగా వచ్చే సమరానికి సిద్ధమవుతున్నాయి.. ఏ మేరకు సత్ఫలితాలు సాధిస్తుందో చూడాలి.

#GameChanZer

By admin