హైదరాబాద్:  “కేసీఆర్ ని ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్నా, కాంగ్రెస్ కే గుద్దండి అందరూ కలసి..” అంటూ కేటీఆర్ అన్నట్టుగా ఉన్న ఓ వీడియో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో ప్రత్యక్షమైంది. సరిగ్గా పోలింగ్ మొదలైన కాసేపటికి ఈ వీడియోని అప్ లోడ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఫేక్ వీడియోతో కేటీఆర్ ని టార్గెట్ చేయాలని చూశారు కాంగ్రెస్ నేతలు. కానీ అంతలోనే వారికి కౌంటర్ పడింది. అసలు వీడియోని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. కేటీఆర్ పూర్తి ప్రసంగాన్ని బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

ఈ మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం.. ఈ విషయాపై క్లారిటీ ఇస్తూ… “ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ చిల్లరగాళ్ళు పోలింగ్ నాడు మరో ఫేక్ వీడియో ప్రచారం మొదలుపెట్టారు.

ఒరేయ్.. చిన్న పిల్లాడు కూడా ఆ వీడియోను చూసిన వెంటనే ఫేక్ అని చెప్పేస్తాడు. డిసెంబర్ మూడవ తారీకు దాకా అగాల్సిన పనిలేదు. వందేళ్లకు పైబడి చరిత్ర ఉన్న మీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ పై ఈ చిల్లర డీప్ ఫేక్ వీడియో వేసినప్పుడే మీ ఓటమి ఖాయం అయ్యింది. మీది ఎంత దౌర్భాగ్యపు పార్టీనో తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యింది. మీకు చైతన్య వంతులైన తెలంగాణ ఓటర్లు ఓటుతోనే బుద్ధి చెబుతారు. మీరు ఎంత గింజుకున్నా కేసీఆర్ విజయాన్ని ఆపలేరు.. అంటూ మండిపడ్డారు.

https://t.co/psOB2XSVN

 

 

https://x.com/INCTelangana/status/1730041352937931060?

 

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *