హైద‌రాబాద్‌: తెలంగాణ ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘గేమ్‌ఛేంజ‌ర్’ స‌ర్వే నిర్వ‌హించి విడుద‌ల చేసింది. ఈ స‌ర్వే ప్ర‌కారం బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్ట‌బోతోంది. కాంగ్రెస్ ప్రచార ఆర్భాటం అంతా గాలిబుడగేనని ఈ సర్వేతో స్పష్టమైంది. బీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ‘గేమ్‌ఛేంజ‌ర్’ స‌ర్వే తెలిపింది.

ఈ స‌ర్వే ప్ర‌కారం కాంగ్రెస్ 35 నుంచి 40 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని స‌ర్వేలో తేలింది. ఇక బీజేపీ 7 నుంచి 9 స్థానాల్లో గెలుస్తుంద‌ని, ఎంఐఎం 6 లేదా 7 స్థానాల్లో గెలుస్తుంద‌ని ఈ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. ఈ స‌ర్వే ప్ర‌కారం బీఆర్ఎస్ 42 శాతం ఓటింగ్ సాధిస్తుంది. కాంగ్రెస్ 36 శాతం, బీజేపీ 15 శాతం, ఎంఐఎం 3 శాతం, బీఎస్పీ 2 శాతం, ఇత‌రులు 2 శాతం ఓట్లు సాధిస్తార‌ని ఈ స‌ర్వే తేల్చింది.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin