హైద‌రాబాద్ (mediaboss network):
గల్ఫ్ సమస్యలను పార్లమెంటులో చ‌ర్చించాల‌ని, ప‌రిష్కారం కోసం కృషి చేయాలంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నారై సెల్ – ప్రవాస భారతీయుల విభాగం విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేర‌కు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెయిల్ ద్వారా ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను వివ‌రించింది. గల్ఫ్ కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ), ఎన్నారై సెల్ – ప్రవాస భారతీయుల విభాగం నుంచి సింగిరెడ్డి నరేష్ రెడ్డి పేర్కొన్న స‌మ‌స్య‌లు ఇలా ఉన్నాయి..

● భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా దేశాలను ఒప్పించి హైదరాబాద్ లో కాన్సులేట్ (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలి. హైదరాబాద్ లో యుఏఈ కాన్సులేట్ ఏర్పాటు చేయడానికి నాలుగేళ్ల క్రితం తేది: 28.06.2018 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలియజేసింది. హైదరాబాద్ లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని 2016 నుండి చేసిన విజ్ఞప్తులకు సౌదీ అరేబియా ప్రభుత్వం సూత్రప్రాయంగా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

● ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీ కొరకు రెండేళ్ల కోసం రూ. 325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో రెనివల్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ కేవలం ప్రమాద మరణం (యాక్సిడెంట్ డెత్) కు మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సహజ మరణం (నేచురల్ డెత్) కూడా కవర్ అయ్యేలా చర్యలు ఇన్సూరెన్స్ లోని నిబంధనలు సవరించాలి. అవసరమైతే కొంచెం ప్రీమియం పెంచండి లేదా సబ్సిడీ ఇవ్వండి. ఇది గల్ఫ్ మృతులకు ఎంతో ఉపయోగపడే విలువైన అంశం. గత 8 సంవత్సరాలలో గల్ఫ్ దేశాలలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికులు మృతి చెందారు.

By admin