• Swamy Muddam

ఇండియన్ బాక్సాపీస్‌కు బిగ్ పంచ్ ఇచ్చేందుకు బ‌రిలోకి దిగాడు లైగ‌ర్. విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన లైగ‌ర్‌ భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి లైగర్ అంచనాలు అందుకున్నాడా.. బాక్సాఫీస్ దగ్గర వాట్ లగా దేంగే అన్నాడా లేదా? ఇవాల్టీ రివ్యూ రిపోర్ట్ లో చూద్దాం..

కథ విష‌యానికి వ‌స్తే..
విజ‌య్.. లైగ‌ర్ పాత్ర‌లో న‌టించాడు. లైగ‌ర్ అమ్మ బాల‌మ‌ణి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించింది. త‌ల్లికొడుకు కరీంనగర్ నుంచి ముంబైకి వస్తారు. ఓ చాయ్ బండి నడుపుకుంటూ తన కొడుకుని నేషనల్ ఛాంపియన్ చేయాలని కలలు కంటుంది. దానికోసం ఒక కోచ్ ను పట్టుకొని ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకుంటాడు లైగర్. ఈ క్రమంలోనే తాన్యతో ప్రేమలో పడతాడు కానీ ఆమె అతని మోసం చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైగర్ నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యాడు..? అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కి ఎలా వెళ్లాడు? మైక్ టైస‌న్‌తో క‌లిసి విజ‌య్ ఏం చేశాడు అనేదే మిగిలిన కథ.

పూరీ మార్క్ సినిమా అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లైగ‌ర్. కాకపోతే ఇది పాన్ ఇండియా స్టైల్‌లో కాస్త గ్రాండ్‌గా చూపించారంతే. కాకపోతే టేకింగ్, మేకింగ్ అంతా సేమ్ టూ సేమ్ అదే పూరీ జగన్నాథే. విజయ్ లాంటి నటుడు దొరికేసరికి లైగర్ స్వరూపమే మారిపోయింది. చిన్న బడ్జెట్ తో చేయాలనుకున్న సినిమాను.. పాన్ ఇండియా యాక్షన్ సినిమాగా మార్చేశారు పూరీ. మొదటి సీన్ నుంచే కథలోకి వెళ్లిపోయాడు డైరెక్టర్. తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మాత్రమే స్క్రీన్ మీద చూపించాడు. అయితే మధ్యలో హీరోయిన్ తో వచ్చే సీన్‌లు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి త‌ర‌హాలో అనిపించినా.. అది ఇది వేరుగా ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉన్న ఎమోషన్ సీన్స్ ఇందులో మిస్ అయినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఫస్టాఫ్ అంత యాక్షన్ సీన్‌ల‌తో పాటు.. అక్కడక్కడ మదర్ సెంటిమెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్ కు చిన్న ట్విస్ట్ ఇచ్చి.. ఆ తర్వాత నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కు లైగర్ ఎలా వెళ్లాడు అనే జర్నీ చూపించాడు. అందరూ ముందు నుంచి ఊహించింది క్లైమాక్స్.. ఎందుకంటే అప్పుడే మైక్ టైసన్ వచ్చేది.. దాన్ని ఊహించినంత చిత్రీకరించలేకపోయాడు పూరి జగన్నాథ్. టైసన్ లాంటి వ‌ర‌ల్డ్ ప్రొఫెస‌న‌ల్ బాక్స‌ర్‌ను తీసుకొచ్చి చాలా సిల్లీగా క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా రొటీన్ కథకు ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తోడు కావడంతో లైగర్ అంత ఆసక్తికరంగా కొన‌సాగ‌దు.

నటీనటుల విష‌యానికి వ‌స్తే..
విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు వన్ మ్యాన్ షోలా కనిపించాడు. తనకు సరిపోయే కారెక్టర్ దొరికితే ఎలా రప్ఫాడుకుంటాడో అర్జున్ రెడ్డిలోనే చూపించేసారు. ఇప్పుడు లైగర్‌లోనూ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు విజయ్. పూర్తిగా ఆయన కారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్. పూరీ ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా అద్భుతమే. నత్తితో త‌న డైలాగ్‌ల‌ను చెప్పే క్యారెక్ట‌ర్‌లో విజయ్ ఓకే అనిపిస్తాడు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ సత్తా చూపించాడు. అనన్యా పాండే కారెక్టర్ ప‌ర్వాలేదు. ఇక‌ రమ్యకృష్ణ చాలా బాగా నటించారు. ఆమెకు మరో పవర్ ఫుల్ కారెక్టర్ దొరికింది. ఇక‌ లైగర్‌ కోచ్‌గా రోనిత్‌ రాయ్‌ మెప్పించాడు. విషురెడ్డి, అలీ, గెటప్‌ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. మైక్ టైసన్ పాత్ర సినిమాకు మెయిన్ హైలైట్. స్క్రీన్ పై చాలా సరదాగా కనిపించాడు మైక్.

టెక్నికల్ విష‌యానికి వ‌స్తే..
లైగర్ సినిమాకు మ్యూజిక్ అందించిన‌ విక్రమ్ మోంత్రోసే, సునీల్ కశ్యప్, తనిష్క్ బఘ్చీ, లియో జార్జ్-డిజే చీట్స్, జానీ పాటలు బాగున్నాయి. విజువల్‌గానూ చాలా ప్రొఫెష‌న‌ల్‌గా చిత్రీకరించాడు పూరీ. సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఎడిటింగ్ పర్లేదు. ఈ విషయంలో జునైద్ వర్క్ బాగానే ఉంది. చివరగా పూరీ జగన్నాథ్ గురించి చెప్పాలి. తనకు కావాల్సినంత టైమ్ తీసుకుని.. విజువల్స్ అదరగొట్టారు. యాక్షన్ సీన్స్ తీసినంత‌గా స్టోరీలో ద‌మ్ము చూపించలేక‌పోయాడు. కానీ కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది. అతి సాధార‌ణ‌ కథను దేశం మొత్తానికి చూపించాలనుకున్నాడు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు.

  • Rating 2/5 

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS APP

By admin