రౌడీ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన మూవీ ‘లైగర్’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇపుడు నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీతో పాటు మిగతా ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ 24 గంటల్లో యూట్యూబ్‌లో 16 మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ‘లైగర్’ మూవీ ట్రైలర్ విడుదలకు ముందు కట్ డ్రాయర్‌తో ఉన్న విజయ్ దేవరకొండ పోస్టర్‌పై నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇది కటౌట్‌లా లేదు.. కట్ డ్రాయర్ యాడ్‌లా ఉందని గేళి చేస్తున్నారు. మరో వైపు విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో పై కూడా ట్రోల్స్ చేశారు. విజయ్ దేవరకొండ ఏం చూసుకొని ఇదంత చేస్తున్నాడనే కామెంట్స్ కూడా నెటిజన్స్ నుంచి వస్తున్నాయి. ఇక లైగర్ మూవీకి ట్యాగ్ లైన్‌గా సాలా క్రాస్ బీడ్ అని పెట్టారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇక తండ్రి పాత్రలో మైక్ టైసన్ నటించాడా అనే డౌట్స్ వస్తున్నాయి. క్రాస్ బ్రీడ్ అంటే ఇండియన్ అమ్మకు.. ఫారెన్ తండ్రికి పుట్టిన అబ్బాయి స్టోరీ. తండ్రి మైక్ టైసన్ బాటలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలవాలనేదే ‘లైగర్’ మూవీ స్టోరీలా కనబడుతోంది. అప్పట్లో తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ స్టోరీని కాస్త మార్చి ‘లైగర్’గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

నిజంగా పూరీ జగన్నాథ్ రమ్యకృష్ణ తల్లిగా.. మైక్ టైసన్ తండ్రి పాత్రలో సాలా క్రాస్ బీడ్ అంటూ లైగర్ మూవీని తెరకెక్కించాడా లేదా అనేది చూడాలి. లైగర్’ మూవీలో హీరో విజయ్ దేవరకొండ.. బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కోసం మన దేశం నుంచి అమెరికాకు వెళతాడు. ఇక నెటిజన్స్ కూడా ‘లైగర్’ మూవీ స్టోరీపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. పూరీ జగన్నాథ్ త‌న గత సినిమాల తరహాలోనే ‘లైగర్’ మూవీని తనదైన శైలిలో తెరకెక్కించినట్టు ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కెరీర్‌లో ఓ సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయడం ఇదే మొదటిసారి అనే చెప్పాలి. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాతో విజయ్‌కు పూరీ జగన్నాథ్ సాలిడ్ హిట్ ‌అందిస్తాడా అనేది చూడాలి.

By admin