MALLAPUR (JAGITYAL) BREAKINGNEWS APP:
రాష్ట్ర‌మంతా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ప‌లు గ్రామాలు ముంపుకు గుర‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గిత్యాల జిల్లా మల్లాపూర్ మండ‌ల కేంద్రం నిండు కుండ‌లా త‌ల‌పిస్తోంది. అతి భారీ వ‌ర్షంతో ఎటూ చూసిన వ‌ర‌ద‌లే క‌నిపిస్తున్నాయి. 30 ఏళ్ల‌లో రికార్డు స్థాయిలో అతి భారీ వ‌ర్షం ఇదేన‌ని చెబుతున్నారు. గ‌త ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో మ‌ల్లాపూర్ గ్రామం చుట్టురా ఉన్న చెరువులు పూర్తిగా నిండిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పంట‌లు పూర్తిగా మునిగిపోగా, జ‌న‌జీవ‌న విధానానికి తీవ్ర ఆటంకంగా మారింది. గ్రామ ప‌రిస్థితిని ఎప్ప‌టికప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌పంచానికి తెలియ‌జేస్తున్నారు మ‌ల్లాపూర్ యువ‌కులు. శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టుకు భారీ వ‌ర‌ద నీరు చేర‌డంతో తాజాగా 36 గేట్లు ఎత్తివేశారు. ఈ ఎఫెక్టుతో గోదావ‌రితో పాటు చెరువులు, కుంట‌ల్లో భారీగా నీరు చేరుతోంది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.

By admin