హైదరాబాద్ (మీడియా బాస్ నెట్‌వ‌ర్క్):
‘మ‌నం’ ఫౌండేష‌న్‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. మనం ఫౌండేషన్ ద్వారా చేస్తున్నసేవకుగాను శ్రీలత కుమార్‌ ప్రజాడైరీ మ్యాగజైన్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి. శ్రీనివాస్ గౌడ్, సినీ ప్రముఖులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, సుమన్ ఈ అవార్డులను హైదరాబాద్ ప్రసాద్ ఫిలిం లాబ్స్ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అంద‌జేశారు.

ఆక‌లి అయిన వారికి క‌డుపు నిండా అన్నం పెట్ట‌డం మాన‌వ‌త్వం. అలాంటి మాన‌వ‌త్వం చూపిస్తున్నారు శ్రీలత కుమార్. మనం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవకు అనేక అవార్డులు, ప్రశంసలు దక్కాయి. తాజాగా వీరు చేస్తున్న సేవలకు గాను ప్రజాడైరీ మ్యాగజైన్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ అవార్డును అందుకున్నారు. బోధన్ మండలం పెంటాకాలాన్ వాసి మనం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీలత కుమార్, ఆర్ఎస్ కుమార్ చేస్తున్న సేవలకు గాను గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన అవార్డు గ్రహితలు, ప్రముఖులు పాల్గొన్నారు.

www.hystar.in

HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి.. HyStar APP Google play store link: https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar website link: www.hystar.in

 

BREAKINGNEWS APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews