మిర్యాలగూడ (మీడియా బాస్ నెట్‌వర్క్):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గోగువారిగూడెంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సీనియర్ దళిత నేత సామాజిక ఉద్యమకారుడు మేధావి బి.వి రాజు, సామాజిక విప్లవ కవి కళాకారులు జయరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు గుండాలు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.