సికింద్రాబాద్: తెలంగాణ మాంగ్ గరోడి SC సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ భాద్యతలు స్వీకరించింది. నేడు లాలగూడ మారాఠా బస్తిలో జరిగిన కార్యక్రమం లో ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై నూతన మాంగ్ గరోడి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఉపాదే సనాధన్, జనరల్ సెక్రటరీగా సకత్ అరుణ్‌లాల్, ఇతర కమిటీ సభ్యులు తమ భాద్యతలను చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మాట్లాడుతూ మాంగ్ గారోడి సమాజ్ హక్కుల సాధనలో 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి అండగా ఉంటుందని అన్నారు. కులధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా, 57 MBSC కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేవిధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తద్వారా మాంగ్ గారోడి కులానికి కూడా సత్వర న్యాయం జరుగుతుంది అన్నారు. హైదరాబాద్ లో 50 వేలకు పైగా ఉన్న మాంగ్ గారోడి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ రుణాలు వెంటనే మంజూరు చేయాలని అన్నారు.సమస్యల సాధన దిశగా నూతన కార్యవర్గం పనిచేయాలని కోరారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపదే సనధన్, సకత్ అరుణ్ లాల్ లు మాంగ్ గారోడి సమాజ్ ప్రజల సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తామని ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
వర్కింగ్ ప్రెసిడెంట్స్ :
కంబ్లె గోపి, కస్బె అజయ్
వైస్ ప్రెసిడెంట్స్ :
కంబ్లె విజయ్
కస్బె గణేష్
ఉపదే రతిలాల్
నాడే జీత్ లాల్
*కోశాధికారి :
సకత్ సంజు
జాయింట్ సెక్రటరీ :
ఉపదే మహేష్
ఉపదే బెజు
సకత్ లక్ష్మణ్ లాల్
కార్యదర్శులు :
కస్బె రూప్ లాల్
కంబ్లె కుంజా
నాడే బెజు
ఆర్గనైజింగ్ సెక్రటరీలు : మగన్ లాల్, గోపీచంద్, కస్బె మేఘమాల, శివకుమార్ లు ఎన్నికయ్యారు.