హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
యదార్థ సంఘటన ఆధారంగా ఓ ప్రేమ పాటను ఆవిష్క‌రిస్తున్నారు ప్రముఖ రచయిత మానుకోట ప్రసాద్. ఈ ప్ర‌యోగాత్మ‌క పాట‌ను తనే రాసి చిన్న రాములమ్మ పాట ఫేం రాము రాథోడ్‌తో పాడించారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తుంద‌ని, త‌మ టీమ్ స‌భ్యులంతా క‌లిసి ఈ పాట‌ను మ‌న‌సు పెట్టి చేశామ‌ని మానుకోట ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ పాట‌కు మానుకోట ప్రసాద్ లిరిక్‌తో పాటు ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే అందించారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించగా, అజయ్ కోడం సినిమాటోగ్రాఫ‌ర్‌గా చేశారు. నవీన మానుకోట ప్రొడ్యూసర్‌గా, కో ప్రొడ్యూసర్‌గా తిరుమల రెడ్డి వ్య‌వ‌హ‌రించారు. ఈ పాట‌లో మానుకోట ప్రసాద్, రాము రాథోడ్, దివ్య భగత్, జానీ యశ్వంత్ తదితరులు నటించారు. డిసెంబ‌ర్ 16న ఈ పాట‌ను తమ‌ నవీన స్టూడియో ఛానల్లో విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు.

By admin