▪️ ఖమ్మం వరద బాధితులకు అండగా టీడీఎఫ్
▪️ ఫేస్ -2 సేవ కార్యక్రమాలకు శ్రీకారం
▪️ TDF సేవలను అభినందించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం: భారీ వరదల నేపథ్యంలో మరోసారి మానవత్వం చాటుకుంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF). భారీ వర్షాలకు అతలాకుతలం అయిన ఖమ్మం రూరల్, దాన్వాయిగూడెం గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది.
భారీ వరదల వల్ల ఇంటిలోని ప్రతి వస్తువును కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణా సామాను పంపిణీ చేశారు TDF నాయకులు. టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో టీడీఎఫ్ వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద బాధితులకు ఆహారం. నిత్యవసర కిరాణా సరుకులు పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీద టీడీఎఫ్ నాయకులు ఫేస్ -2 సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీఎఫ్ చేస్తున్న సేవ కార్యక్రమాలను కొనియాడారు. ఆపద వేళ ప్రజలకు అండగా ఉంటున్న టీడీఎఫ్ – యూఎస్ఏ, టీడీఎఫ్ – ఇండియా సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం సేవ కార్యక్రమాలు టీడీఎఫ్ కొనసాగిస్తోందని, మున్ముందు కూడా సేవలు అవసరం ఎంతో ఉందని వారిని కోరారు.
కష్టకాలంలో తమకు నిత్యవసరాలు అందించిన టీడీఎఫ్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల స్టేషనరీ, ప్రాథమిక మందులు, బట్టలు అందించమని TDFని అభ్యర్థించారు. ఇంటి ఎలక్ట్రికల్ను రిపేర్ చేయాలని, కొన్నింటిని భర్తీ చేయాలని వేడుకున్నారు. వైరింగ్ వ్యవస్థలు, గృహ ఎలక్ట్రికల్ ఉపకరణాలు వరదల వల్ల వారి ఇళ్లు మునిగిపోవడం వల్ల దెబ్బతిన్నాయి. ఈ అభ్యర్థనలను త్వరలో నెరవేరుస్తామని టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
కష్ట సమయాల్లో నిరుపేదలను సమకూర్చేందుకు టీడీఎఫ్-యూఎస్ఏ, టీడీఎఫ్ కెనడా, టీడీఎఫ్ యూకే, యూరప్ వంటి వివిధ దేశాలకు చెందిన టీడీఎఫ్ చాప్టర్లతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. కష్ట సమయాల్లో తమ మాతృభూమి తెలంగాణకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి సహాయం చేసినందుకు దేశంలోని అన్ని ఛాప్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. వరద సహాయక శిబిరాలను అమలు చేయడం కోసం విరాళాలు అందించిన ఎన్నారైలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.