Mumbai (media boss network): ఇటీవల భారీ వర్షాలతో ఎన్నో నిర్మాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రాణనష్టం కూడా కలుగుతోంది. ఇటీవల భారీ వర్షాలకు ముంబై మహనగరం కూడా అతలాకుతలం అవుతోంది. అయితే ఇలాంటి పరిస్థితులకు ముందు జాగ్రత్తగా ముంబైలోని రాజ్‌భవన్‌కు ప్రత్యేక నిర్మాణం చేపట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకుని రాజ్‌భవన్‌కు ప్రత్యేక నిర్మాణాలు చేయించారు. ఇందులో భాగంగా సముద్రానికి ఆనుకుని ఉన్న రాజ్‌భవన్‌కు నీటి తాకిడి రాకుండా సముద్రంలో ఓ నిర్మాణం చేపట్టారు.
సూర్యభగవానుని సాక్షిగా సముద్ర దేవున్ని ఆరాధిస్తున్నట్టు ఉంది ఈ నిర్మాణం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ, సముద్ర అలలు ఎగిసివస్తున్న ఈ సమయంలో ఈ నిర్మాణం రాజ్‌భవన్‌కు రక్షణ ఇస్తోందంటూ రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అప్పటి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చొరవను గుర్తు చేసుకుంటున్నారు. విద్యాసాగర్ రావు మహరాష్ట్ర గవర్నర్‌గా కొనసాగిన కాలంలో ప్రత్యేక చొరవ తీసుకుని రాజ్‌భవన్‌కు ఆధునిక హంగులు అద్దారు.