హైదరాబాద్ (Media Boss Network): తెలంగాణ రాజకీయం మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. తమకు టికెట్ ఇవ్వాలంటూ ఆశావహులు పోటీ పడుతున్నారు. రెండు పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ నేతల హడావుడి మినిస్టర్ క్వార్టర్స్, ప్రగతి భవన్ చుట్టూ తిరిగింది.
ఈ క్రమంలో మునుగోడులో TRS టికెట్ ఎవరికి ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంది? అంటూ గేమ్‌ఛేంజర్ సంస్థ BREAKINGNEWS TV వేదికగా ఓ భారీ పోల్ నిర్వహించింది. ఈ క్రమంలో ఆశావాహుల పేర్లలో అత్యధికంగా బూర నర్సయ్య గౌడ్‌కు 62% ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత 21% ఓట్లతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 13 శాతంతో కర్నె ప్రభాకర్ మూడో స్థానంకే పరిమితమయ్యారు. మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో బీసీ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇందులో అధికంగా ఉన్న గౌడ సామాజిక వర్గం ఓట్లు ప్రభావం చూపిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. దీంతో గౌడ సమాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్యకు Game Chanzer పోల్ ఏకంగా 62% ఓట్లు పడటంతో అందరి దృష్టి ఆయనపైనే పడింది. మరి ఈ విషయంలో గులాబీ దళపతి కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్.