సింగపూర్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) సింగపూర్ విభాగం అధ్వర్యంలో సింగపూర్ లో నివసిస్తున్న ఆర్య వైశ్యులు శ్రావణపౌర్ణమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీతధారణ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నల్ల భాస్కర్ గుప్త, కంకిపాటి శశిధర్, ఉద్దగిరి సతీష్, వెంకట రమణ నంగునూరి, సంకా వెంకట రవికుమార్ ల సారధ్యంలో ధార్మిక విషయాలకు పెద్దపీట వేస్తూ వైదిక కార్యక్రమమైన జంధ్యాల పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పురోహితులు శ్రావణ్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం 12/08/2022 సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంట‌ల నుండి 8.30 వరకు జరిగినది. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ, ద్విజులుగా పిలువబడే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు సనాతనధర్మాన్ని అనుసరించి యజ్ఞోపవీతాన్ని విధిగా ధరించాలని, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పెరిగిపోయి ఆచారాలను మర్చిపోతున్న ఈ రోజులలో విదేశాలలో ఉన్నాకూడా సనాతనధర్మాన్ని పాటిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం అభినందనీయమన్నారు.

జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమం కలశ స్థాపనతో మొదలై, గణపతి పూజ, గాయత్రి మంత్ర పఠనం, ఇతర వేదమంత్రాలతో జరిగి చివరగా ఆశీర్వచనంతో ముగిసింది. వామ్ (WAM) సింగపూర్ కమిటి సభ్యులు కంచర్ల శరత్ బాబు, కోట సతీష్ లు కార్యక్రమం నిర్వహణను ప్రర్యవేక్షించారు. WAM సింగపూర్ విభాగం అధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల మాట్లాడుతూ పిలిచిన వెంటనే అందరూ చేరి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, బివిఎస్ ప్రసాద్, ఫణి, నామ శ్రీపాద, కిషోర్ శెట్టి, నరేంద్ర ఆర్ఎస్, విజయ పడి, రామమోహన్, పాలెపు మల్లికార్జున, అప్పన చంద్ర గుప్త, వుద్దగిరి భాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By admin