“కొంజుం వెయిల్ కొంజుం మలయ్ కాధలుక్కు ఇల్లై, గాంతం” చిత్రాలతో తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ “తేజ్” త్వరలో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తేజ్ ప్రతి నాయకుడిగా పవర్ ఫుల్ రోల్ చేస్తున్న “గాడ్” తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. తేజ్ ప్రస్తుతం కన్నడలో “రామాచారి -2″లో నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల కానుంది.

“గ్లోరి ఆఫ్ డెమన్” అనే ట్యాగ్ లైన్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “గాడ్” చిత్రంలో ప్రఖ్యాత కన్నడ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. తేజ్ నటిస్తున్న కన్నడ చిత్రం “రామాచారి -2” చిత్రం కూడా తెలుగులో విడుదల చేయనున్నారు!!

By admin