జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తోపాటు జనసేన నాయకులను విశాఖలో అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని….విశాఖలో అత్యంత రద్దీగా ఉండే టైకూన్ జంక్షన్‌ను వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసం మూసేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గం అంటూ ఆగ్రహించారు.శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం సరి కాదని వెల్లడించారు. వైసీపీ నేతల ఆస్తులకు వాస్తు దోషం ఉందంటూ ప్రజా రహదారిని మూసేయడం వైసీపీ అరాచకాలకు అద్దం పడుతుంది….నాలుగున్నరేళ్లలో కొత్తగా ఒక్క రహదారీ నిర్మించకుండా ఉన్న రహదారులను వాస్తు పేరుతో మూసేస్తారా? అని ప్రశ్నించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా దారిమళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నారు….ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతుందా..? అని నిలదీశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.