మాట తప్పాడు..మడమ తిప్పాడు..హామీలు ఎగ్గోట్టాడని సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం..కడతాం.. అని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు..ఈ 4 సం”ల 9 నెలలు పూర్తి అయిన సందర్భంగా…జగనన్న ఎగ్గొట్టిన 50 హామీల లిస్టును ప్రకటించారు గంటా. ఇవి టాప్ 50 మాత్రమే….ప్రాముఖ్యత తక్కువ ఉన్న హామీలు బయటకు తీస్తే…..*దీనికి మరో మూడింతలు అవుతుందని ఆగ్రహించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.మీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడంలో చతికిలపడింది…మీరు చెప్పిన సంక్షేమం సంక్షోభంలో పడిందన్నారు. మీ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమైయ్యారు..ఈ సారి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని వెల్లడించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. మీ ప్రభుత్వానికి దుకాణం సద్దుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు..బై జగన్… బై బై జగన్ అంటూ చురకలు అంటించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

By admin