సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి (Rana Daggubati), న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన‌ చిత్రం విరాట పర్వం. ఈమూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో విరాట పర్వం నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, టీజ‌ర్స్‌తో, వీడియోస్ సినిమాపై ఆసక్తినిక్తి క్రియేట్ చేయగా.. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విరాట పర్వం సినిమా నుంచి నగదారిలో సాంగ్ ప్రోమ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. “నిప్పు ఉంది.. నీరు ఉంది.. నగదారిలో.. చివరకు నెగ్గిదేగ్గి ది.. తగ్గేదేగ్గే ది నగదారిలో ”.. సాగే ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది. నగదారిలో ఫుల్ లిరికల్ సాంగ్ ను రేపు (జూన్ 2న) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. సాయి పల్లవిల్ల , రానా దగ్గుబాటి లుక్స్.. ఆకట్టుకుంటున్నాయి. ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ సాహిత్యం అందించిన ఈ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా. వరం అద్భుతంగా ఆలపించారు. నక్సలైట్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా.. రవి శంకర్ అలియాన్ రవన్న పాత్రలో నటించగా. సాయి పల్లవిల్ల వెన్నె ల పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్ బ్యా నర్లపైర్ల సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.

 

By admin