“మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లితండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. సమాజంలో అత్యున్నత స్థానం, పాత్రను “గురువు” పోసిస్తారు.
అంతటి విలువైన గురువుకి సంబంధించిన క‌థతో తెరకెక్కిన చిత్రం ‘నీతోనే నేను’. నిజ జీవితంలో గురువు ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై, అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాతో మేక‌ర్స్ ఏం చెప్పాల‌నుకున్నారు? ‘నీతోనే నేను’ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీనా? లేక ల‌వ్ స్టోరీనా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే రివ్యూ రిపోర్టులోకి వెళ్లాల్సిందే.

కథ‌:
రామ్ (వికాస్ వ‌శిష్ట‌) ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ ఉపాధ్యాయుడు. వృత్తి రీత్యా తన భాద్యత మాత్రమే కాకుండా తన స్కూల్‌లో పిల్ల‌లు చ‌క్క‌గా చదువుకుని జీవితంలో గొప్పగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో త‌న‌ను చూసి కొంద‌రు ఉపాధ్యాయులు ఈర్ష్య ప‌డుతుంటారు. కొంద‌రు ఇష్ట‌ప‌డుతుంటారు. అలా రామ్‌ను ఇష్ట‌ప‌డుతుంది ఆయేషా (కుషిత క‌ళ్ల‌పు). ఆమె అదే స్కూల్‌లో పీటీ టీచ‌ర్‌. క్ర‌మంగా ఆయేషాకు రామ్‌పై ఏర్ప‌డ్డ ఇష్టం ప్రేమ‌గా మారుతుంది. ఓ రోజు ఆయేషా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను రామ్‌కు చెబుతుంది. అయితే త‌న‌కు పెళ్లైంద‌ని, చిన్న‌నాటి స్నేహితురాలే సీత (మోక్ష‌)ని పెళ్లి చేసుకున్న‌ట్లు రామ్ చెబుతాడు. ఓ రోజు రామ్‌, సీత‌ల‌ను ప‌ల‌క‌రిద్దామ‌ని వారింటికి వెళుతుంది ఆయేషా. అయితే ఆమెకు షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. ఇంత‌కు రామ్ గురించి ఆయేషాకు తెలిసే నిజం ఏంటి? రామ్ జీవితంలో ఉన్న స‌మ‌స్య ఏంటి? సీత‌కు ఆయేషాకు ఉన్న సంబంధం ఏంటి? త‌న స్కూల్‌లోని పిల్ల‌ల కోసం రామ్ చేసే ప‌నేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల ప్రతిభ:
‘బండి’ సినిమాతో మెప్పించిన వికాస్ వ‌శిష్ట ఓ వైపు గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌గా, మ‌రో వైపు భార్య కోసం ప‌రిత‌పించే పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. కుషిత క‌ళ్ల‌పు లుక్ ప‌రంగా చ‌క్క‌గా ఉంది. ఎమోష‌న‌ల్ పాత్ర‌లో మోక్ష మెప్పించింది. క‌న్నింగ్ టీచ‌ర్ పాత్ర‌లో ఆకెళ్ల న‌ట‌న ఆక‌ట్టుకుంది.

విశ్లేష‌ణ‌:
టీచ‌ర్‌గా ప‌ని చేసి ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్న నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి త‌ను నిజ జీవితంలో చూసిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను త‌యారు చేశారు. చాలా చోట్ల గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌లో చ‌దివే పిల్ల‌ల‌కు చాలా స‌రైన వ‌స‌తులు ఉండ‌వు. కానీ వాళ్లకి మంచి స‌దుపాయాల‌ను ఏర్పాటు చేస్తే వాళ్లు కార్పొరేట్ స్కూల్స్‌లోని పిల్ల‌ల‌కు ధీటుగా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అనే విష‌యాన్ని డైరెక్ట‌ర్ అంజిరామ్ తెర‌కెక్కించిన తీరు బావుంది. ఓ వైపు మెసేజ్‌తో పాటు మంచి ల‌వ్ స్టోరీని మిక్స్ చేసి తెర‌కెక్కించారు. క‌థ‌ను స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో తీసుకెళుతూ ఇంట‌ర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మ‌ధ్య ఇచ్చే ట్విస్ట్ బావుంది. అయితే తే ఫ‌స్టాఫ్‌ను కాస్త ట్రిమ్ చేయాల్సింది అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ఈ ట్విస్టుల‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. కాక‌పోతే క‌థ మ‌ధ్య‌లో క‌మ‌ర్షియ‌ల్ సాంగ్ పెట్టటం ఈ స‌బ్జెక్టు ప‌రంగా స‌రికాదేమో అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ విజువ‌ల్స్ బావున్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్ అందించిన పాట‌లు బావున్నాయి. నిర్మాత సుధాక‌ర్ రెడ్డి త‌న ప‌రిధి మేర‌కు మంచి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సినిమాను క్వాలిటీగా రూపొందించారు.

మొత్తంగా ఒక గవర్నమెంట్ టీచర్, త‌న‌కు వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా విద్యార్థుల‌ కోసం ఎంతలా తాపత్రయపడతారు అనే అంశాన్ని కమర్షియల్ కోణంలో చూపించిన‌ ‘నీతోనే నేను’ సినిమా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంద‌ని చెప్పొచ్చు.

రేటింగ్: 3 / 5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin